దేశానికి రాజీవ్ గాంధీ చేసిన సేవలు మరువలేనివి
– ఆయన ఆశయ సాధనకు కృషి చేయాలి
– తాండూరులో ఘనంగా జయంతి
తాండూరు, దర్శిని ప్రతినిధి: భారత మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ దేశానికి చేసిన సేవలు మరువలేనివని తాండూరు కాంగ్రెస్ నేతలు శనివారం కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు ప్రభాకర్ గౌడ్ ఆధ్వర్యంలో తాండూరు పట్టణం హైదరాబాద్ రోడ్డు మార్గంలోని రాజీవ్ గృహకల్ప కాలనీ వద్ద ఈ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు రాజీవ్ గాంధీ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ దేశ సమగ్రతకు ఎంతో కృషి చేశారని కొనియాడారు. పేదల సంక్షేమానికి అనేక సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టి చిరస్మరణీయుడుగా నిలిచారని అన్నారు. ఆయన ఆశయ సాదనకు అందకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు ఎంఏ ఆలీం, సర్దార్ ఖాన్, పి.బస్వరాజు, కోర్వార్ నగేష్, మైనార్టీ నాయకులు నవాజ్, యువ నాయకులు హేమంత్ కుమార్, కలాల్ చంద్రశేఖర్ గౌడ్, ఎన్ఎస్‌యూఐ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ అకింగ్, పట్టణ అధ్యక్షులు ఎబినేజర్, నేతలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


