పేయింటర్లపై పెత్తనమా..!
– రాతలు రాస్తే.. బూతులు తిట్టారు
– గుద్దుతూ పోలీస్టేషన్లో పెట్టారు
– నిర్బంధంపై వాల్ పేయింటర్స్ వేధన
తాండూరు, దర్శిని ప్రతినిధి: బతుకు దెరువులో భాగంగా గోడలపై రాతలు రాయనీకే వస్తే బూతులు తిట్టి దాడలు చేశారని వాల్ పేయింటర్స్ ఆవేధన వ్యక్తం చేశారు. పేయింటర్లపై రాజకీయ పెత్తనమా.. అంటూ మండిపడ్డారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మురళీకృష్ణ గౌడ్ పేరుతో తాండూరు ప్రాంతంలోని గోడలపై స్లోగన్స్ రాస్తున్న పేయింటర్లపై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేసిన సంఘటన చర్చనీయాంశంగా మారింది. సోమవారం పోలీస్టేషన్లో నిర్బంధానికి గురైన బాధిత పేయింటర్లు మంగళవారం మీడియాతో మాట్లాడారు. యాదాద్రి జిల్లా తుర్కపల్లి మండలం మాదాపూర్‌కు చెందిన చంద్రశేఖర్ మాట్లాడుతూ తాండూరులోని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మురళీకృష్ణ గౌడ్ పిలుపు మేరకు తాండూరులో వాల్ పేయింట్ పనులు చేసేందుకు వచ్చావని చెప్పుకొచ్చారు. గత ఐదు రోజులుగా పట్టణంలోని వివిధ ప్రాంతాలలో రాజుగౌడ్, జాగృత్ అనే వ్యక్తులతో కలిసి గోడలపై స్లోగన్స్ రాసేందుకు పేయింటింగ్ పనులు చేస్తున్నామని తెలిపారు. సోమవారం హైదరాబాద్ రోడ్డుమార్గంలో పనులు చేస్తుండగా తమకు గుర్తుతెలియని ఐదు మంది ఫార్ట్చునర్ కారులో వచ్చి తమను బూతులు తిడుతూ దాడిచేశారని ఆరోపించారు. అనంతరం తాండూరు పట్టణ పోలీస్టేషన్‌కి తీసుకెళ్లారని వివరించారు. పోలీసులు సోమవారం మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు నిర్బంధించారని తెలిపారు. రాజకీయాలు ఉంటే మీరు మీరు చూసుకోవాలని, బతుకు దెరువులో భాగంగా వచ్చిన పేయింటర్లపై పెత్తనం ఎందుకు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేయింటర్లపై జులుం ప్రదర్శించడం పద్దతి కానే కాదన్నారు. జరిగిన సంఘటనపై మురళీకృష్ణగౌడ్‌తో చర్చించి పోలీసులకు ఫిర్యాదు చేస్తామని పేర్కొన్నారు.


