బచ్పన్ ట్రస్ట్ సేవా తత్పరత భేష్..!
– రక్తదాన శిబిరం ఏర్పాటు అభినందనీయం
– తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి
– ఎంసీహెచ్ ఆసుపత్రిలో పంపణీ చేసిన సభ్యులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరుకు చెందిన బచ్ పన్ చారిట్రబుల్ ట్రస్ట్ సేవా తత్పరతను చాటుకోవడం భేష్ అని డీఎస్పీ బాలకృష్ణారెడ్డి కితాబిచ్చారు.

ఆదివారం తాండూరుకు చెందిన పదో తరగతి 98-99 బ్యాచ్ బచ్ పన్ చారిట్రబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పట్టణంలోని జేబీ హాస్పిటల్లో ఆసుపత్రి వైద్యులు డా. సృజన, డా. కళ్యాణ్ మోహన్ రావు పర్యవేక్షణలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై శిబిరంను ప్రారంభించారు. ఇందులో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రాజు గౌడ్ పాల్పంచుకున్నారు.

ఈ సందర్భంగా డీఎస్పీ బాలకృష్ణారెడ్డి మాట్లాడుతూ యువత బచ్ పన్ చారిట్రబుల్ ట్రస్ట్ ద్వారా సమాజానికి ఉపయోగపడే సేవా కార్యక్రమాలు నిర్వహించడం ఆదర నీయమన్నారు. ఆపదలో ఉన్న వారికి రక్తదానం సహకరిస్తుందని తెలిసి.. ప్రత్యేక శిబిరం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. యువత రక్తదానంతో పాటు సేవా కార్యక్రమాలు చేపట్టాలన్నారు. అంతకుముందు బచ్ పన్ చారిట్రబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో తాండూరులోని మాతా శిశు ఆసుపత్రిలో రోగులకు, బంధువులుకు పండ్లు పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో మాజీ ఫ్లోర్ లీడర్ లింగదలి రవికుమార్, మాజీ కౌన్సిలర్ ప్రభాకర్ గౌడ్, బీఆర్ఎస్ మైనార్టీ సెల్ అధ్యక్షులు యూనుస్ ఖాన్, ఉదయ్ శంకర్, అభిలాష్ రెడ్డి, భరత్ రెడ్డి, ట్రస్టు చైర్మన్ మోహన్ కృష్ణ గౌడ్, నయూం, గౌరవ అధ్యక్షులు రంజిత్ కుమార్, అధ్యక్షులు ఎం.ఏ మతీన్, ఉపాధ్యక్షులు గాయత్రి, ప్రధాన కార్యదర్శి రవికుమార్, సంయుక్త కార్యదర్శి విజయానంద్, కోశాధికారి తయాబ్ ఈర్షాద్, వర్కింగ్ ప్రెసిడెంట్స్ జుబైర్ ఉద్దీన్, అభిషేక్, పద్మావతి, సభ్యులు కిషన్ గోపాల్ రాఠి, సన్ని అగ్రవాల్, సంతోష్ కుమార్, అరుణ్ కుమార్. ఎర్రం శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.
ఇదికూడా చదవండి…

