గణేష్ ఉత్సవాలను ఘనంగా జరుపుకుందాం
– జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మురళీకృష్ణ గౌడ్
– హిందూ ఉత్సవ సమితికి రూ. 51 వేల విరాళం
తాండూరు, దర్శిని ప్రతినిధి: వచ్చే గణేష్ చవితి ఉత్సవాలను ప్రశాంతంగా.. ఘనంగా జరుపుకుందామని వికారాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గాజీపూర్ మురళీకృష్ణ గౌడ్ అన్నారు. గురువారం తాండూరు హిందూ ఉత్సవ కేంద్ర సమితికి రూ. 51 వేలను చందా అందజేశారు. సమితి ప్రధాన కార్యదర్శి పట్లోళ్ల నర్సింలు చేతుల మీదుగా రసీదును స్వీకరించారు. ఈ సందర్భంగా హిందూ సంప్రదాయాలలో వినాయక చవితి తొలి పండగ అని అన్నారు. కరోనా ప్రభావంతో గత రెండు ఏళ్లు పండగను నామమాత్రంగా జరుపుకున్నారని, వచ్చే వినాయక ఉత్సవాలను ప్రశాతంగా.. ఘనంగా జరుపుకోవాలని అన్నారు. మరోవైపు హిందూ ఉత్సవ సమితికి విరాళం అందజేసిన మురళీకృష్ణ గౌడ్‌కు సమితి సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సమితి సభ్యులు బోయరాజు, పూజారి పాండు, కౌన్సిలర్లు రాము, వెంకన్నగౌడ్, అశోక్, అంతారం కిరణ్ తదితరులు ఉన్నారు.


