అట్టహాసంగా లంకాదహానం..!

తాండూరు రాజకీయం వికారాబాద్

అట్టహాసంగా లంకాదహానం..!
– పాల్గొన్న ఆర్బీఓఎల్ సీఈఓ శ్రీనివాస్ రెడ్డి
– భారీగా తరలి వచ్చిన భక్తులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : భావిగి భద్రేశ్వర మహోత్సవాలలో రెండు ప్రధాన ఘట్టాలైన రథోత్సవం, లంకాదహానం సంబరంగా ముగిశాయి. సోమవారం తెల్లవారు జామున నిర్వహించిన లంకాదహనం వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ఈ లంకాదహాన వేడుకలు ఆదివారం రాత్రి 11 గంటల తరువాత ప్రారంభమయ్యాయి.

దేవాలయ రేనవేషన్ కమిటి చైర్మన్ పటేల్ కిరణ్ కుమార్, ఈఓ శేఖర్ గౌడ్ ల ఆధ్వర్యంలో స్వామి పల్లకి సేవను ఊరేగింపుగా నిర్వహించారు. భక్తులు దివిటిలతో, భజన కీర్తనలతో భద్రేశ్వర చౌక్నుంచి గాంధీచౌక్, జుమ్మా మసీద్, ముర్షద్ దర్గా మీదుగా బసవణ్ణ కట్ట వరకు చేరుకుంది. దివిటిల వెలుగులో పల్లకి సేవను గమ్యానికి చేర్చారు. ఈ ఉత్సవ ఊరేగింపులో తాండూరు కాంగ్రెస్ నాయకులు, ఆర్బీఓఎల్ సీఈఓ బుయ్యని శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. పల్లకి సేవలో భద్రేశ్వర స్వామిని దర్శించుకుని పూజలు నిర్వహించారు.

ఊరేగింపు ముందు కళాకారుల నృత్యప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అనంతరం బసవణ్ణ కట్ట వద్దకు రాగానే ఏర్పాటు చేసిన శ్రీనివాస్ రెడ్డి చేతుల మీదుగా లంకాదహన వేడుకలను ప్రారంభించారు. భక్తులు కూడా భారీ ఎత్తున బాణాసంచాలను పేలుస్తూ అంబరాన్నంటేలా వేడుకలు నిర్వహించారు. మరోవైపు మతసామరస్యానికి విఘాతం కలగకుండా పోలీసులు బందోబస్తును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటి సభ్యులు, వీరశైవ సమాజం సభ్యులు, యువదళ్ సభ్యులు, నాయకులు భక్తులు తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి….

రేపే ఇంటర్ రిజల్ట్..!