రిటైర్డ్ ఉద్యోగులకు అండగా ఉంటా

తాండూరు రాజకీయం వికారాబాద్

రిటైర్డ్ ఉద్యోగులకు అండగా ఉంటా
– తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి
– విశ్రాంత ఉద్యోగులతో సమావేశమైన ఎమ్మెల్యే
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరులోని రిటైర్డు ఉద్యోగులకు అండగా ఉంటానని ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి అన్నారు. బుధవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి తాండూరులోని రిటైర్డ్ ఎంప్లాయిస్ సోసైటీ సభ్యులతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి మాట్లాడుతూ. తాండూరు రిటైర్డ్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేయడం జరుగుతుందన్నారు. భవిష్యత్తులో కూడా అండగా ఉంటామన్నారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి భారీ మెజార్టీ అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు పట్లోళ్ల నర్సింలు, శ్రీనివాస్ చారి, మాజీ కౌన్సిలర్ జుబేర్ లాల, రిటైర్డ్ ఉద్యోగుల సంఘం సభ్యులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

 మోసపోవద్దు గొసపడతాం..