కొత్త ఉత్సహాంతో పనిచేస్తా..!
– జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజుగౌడ్
– రాజుగౌడ్‌ను సన్మానించిన కౌన్సిలర్ మంకాల రాఘవేందర్
తాండూరు, దర్శిని ప్రతినిధి: ప్రజలు చూపిస్తున్న ఆదరాభిమానాలు మరువలేనివని, వారి ఆశీర్వాదంతో కొత్త ఉత్సహాంతో టీఆర్ఎస్ పార్టీ, చైర్మన్ పదనవి గౌరవం తీసుకవస్తానని వికారాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజుగౌడ్ పేర్కొన్నారు. గురువారం తాండూరు పట్టణం 26వ వార్డు కౌన్సిలర్ మంకాల రాఘవేందర్ ఆధ్వర్యంలో రాజుగౌడ్‌కు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. వార్డులోని కట్ట మైసమ్మ దేవాలయంలో పూజలు నిర్వహించిన అనంతరం రాజుగౌడ్‌ను మంకాల రాఘవేందర్‌తో పాటు మార్కెట్ కమిటి వైస్ చైర్మన్ వెంకట్ రెడ్డి తదితరులు సన్మానించారు. ఈ సందర్భంగా రాజుగౌడ్ మాట్లాడుతూ ప్రజలు చూపిస్తున్న అభిమానం మరువలేనిదన్నారు. తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి సహాకారంతో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పదవికి, టీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి నూతనోత్సంతో కృషి చేస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ బీసీ సెల్ పట్టణ ఉపాధ్యక్షుడు కోటం ప్రసాద్, మాజి కౌన్సిలర్ సుమిత్ గౌడ్, సీనియర్ నాయకులు చెన్ బసప్ప, వార్డ్ పెద్దలు, యువకులు పాల్గొన్నారు.


