విముక్తి పొరాటంతోనే తెలంగాణ
– తెలంగాణను సంక్షేమ రాష్ట్రంగా మార్చిన సీఎం కేసీఆర్
– తాండూరు ప్రగతికి ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి కృషి
– జెండా ఆవిష్కరించిన మార్కెట్ కమిటి చైర్మన్ విఠల్ నాయక్
తాండూరు, దర్శిని ప్రతినిధి : ఎన్నో పోరాటాల తరువాతే రాచరిక పాలన నుంచి, ఆంద్రా పరిపాల నుంచి తెలంగాణ విముక్తి పొందిందని తాండూరు మార్కెట్ కమిటి చైర్మన్ విఠల్ నాయక్ అన్నారు. శనివారం తాండూరు మార్కెట్ కమిటి కార్యాలయంలో జాతీయ సమైక్యత వజ్రోత్సవాలను వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మార్కెట్ కమిటి చైర్మన్ విఠల్ నాయక్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేశంలో తెలంగాణ విలీనమైన రోజును భావితరాలకు గుర్తుచేసేందుకు తెలంగాణ ప్రభుత్వం జాతీయ సమైక్యత దినోత్సవం నిర్వహిస్తోందన్నారు. సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవం పురస్కరించుకొని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో జాతీయ సమైక్యత వజ్రోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నామన్నారు. ఉద్యమాలతో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ పేదలకు ఎన్నో పథకాలను ప్రవేశ పెట్టి సంక్షేమం వైపు నడిపిస్తున్నారని అన్నారు. అదేవిధంగా తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి సహకారంతో తాండూరు అభివృద్ధి పథంలో దూసుకు వెళ్తుందని తెలిపారు.
రాజుగౌడ్‌కు సన్మానం

మరోవైపు వికారాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌గా నియామకమైన రాజుగౌడ్‌ను మార్కెట్ కమిటి చైర్మన్ విఠల్ ఘనంగా సన్మానించారు. విశిష్టమైన సేవలను అందించి జిల్లాను ఆదర్శంగా నిలపాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలొ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ వెంకట్ రెడ్డి, డైరెక్టర్లు ఆశన్న భీమ్ రెడ్డి మల్లప్ప ఇర్ఫాన్, వీరేందర్, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పట్లొల నర్సింలు, ఆలయ చైర్మన్లు సంజీవరావు, రాజన్ గౌడ్, కౌన్సిలర్ లు ఆసిఫ్, భీమ్ సింగ్ రాథోడ్, ది మర్చంట్ అసోసియేషన్ అధ్యక్షులు రామ్ రెడ్డి, ఉర్దూగర్ చైర్మన్ అబ్దుల్ రజాక్, నాయకులు సంతోష్ గౌడ్, చంటి యాదవ్, హమాలి గుమస్తా సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.


