బెల్ట్ దందాకు కళ్లెం..!
– భారీగా మద్యం బాటిళ్ల స్వాదీనం
– రాజీవ్ కాలనీలో ఇద్దరిపై కేసులు
– వెల్లడించిన యాలాల ఎస్ఐ విఠల్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం హైదరాబాద్ రోడ్డు మార్గంలోని రాజీవ్ కాలని, ఇందిరమ్మ కాలనీలలోని బెల్ట్ దందాకు యాలాల పోలీసులు కళ్లెం వేశారు.

యాలాల ఎస్ఐ విఠల్ రెడ్డి ఆధ్వర్యంలో విస్తృత దాడులు నిర్వహించి భారీగా మద్యం బాటిళ్లను స్వాదీనం చేసుకున్నారు. అక్రమంగా విక్రయాలకు పాల్పడుతున్న ఇద్దరిపై కేసులు నమోదు చేసినట్లు యాలాల ఎస్ఐ విఠల్ రెడ్డి తెలిపారు. గత కొన్ని రోజులుగా రాజీవ్ కాలనీ, ఇందిరమ్మ కాలనీలలో మద్యం విక్రయాలు జరుగుతున్నాయని ఆరోపణలు ఉన్నాయి.

శనివారం యాలాల ఎస్ఐ విఠల్ రెడ్డి తన సిబ్బందితో కలిసి కాలనీలలో దాడులు నిర్వహించారు. ఈ దాడిలలో రాజీవ్ కాలనీకి చెందిన మాల వెంకటప్ప వద్ద 71 మద్యం బాటిళ్లు, సగ్గం నారాయణ వద్ద 82 మద్యం బాటిళ్లు సుమారు 25 లీటర్లకు పైగా మద్యం బాటీళ్లను స్వాదీనం చేసుకున్నట్లు ఎస్ఐ విఠల్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు వారిపై కేసులు నమోదు చె యడం జరిగిందన్నారు. ఎవరైనా బెల్టు షాపులు నిర్వహిస్తూ అక్రమంగా మద్యం విక్రయాలకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు.

ఇదికూడా చదవండి…

