తాండూరు సంపూర్ణ సుర‌క్ష క్లీనిక్‌కు ఉత్త‌మ గుర్తింపు

ఆరోగ్యం తాండూరు వికారాబాద్

తాండూరు సంపూర్ణ సుర‌క్ష క్లీనిక్‌కు ఉత్త‌మ గుర్తింపు
– రాష్ట్రంలో మూడో మోడ‌ల్ సెంట‌ర్‌గా ఎంపిక
– జిల్లా ఆసుప‌త్రిని సంద‌ర్శించిన నాకో ఢిల్లీ బృందం
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి : వికారాబాద్ జిల్లా తాండూరులోని జిల్లా ఆసుప‌త్రి ఆధ్వ‌ర్యంలో కొన‌సాగుతున్న సంపూర్ణ సుర‌క్ష క్లీనిక్‌కు మంచి గౌర‌వం ద‌క్కింది. హెచ్ఐవీ/హెచ్ఆర్‌జీ బాధితుల‌కు అందిస్తున్న సేవ‌ల‌కు గాను రాష్ట్రంలోనే మూడో మాడ‌ల్ సెంట‌ర్‌గా ఎంపికైంది. సోమ‌వారం జిల్లా ఆసుప‌త్రిలోని ఏఆర్‌టీ సెంట‌ర్, ఐసీటీసీఎస్‌టీఐ క్లీనిక్‌ల‌ను నేష‌న‌ల్ ఏయిడ్స్ కంట్రోల్ ఆర్గ‌నైజేష‌న్(నాకో) ఢిల్లీ బృందం సంద‌ర్శించింది. జిల్లా ఆసుప‌త్రి సూప‌రిండెంట్ డాక్ట‌ర్ ర‌విశంక‌ర్‌తో క‌లిసీ ఆయా విభాగాల‌తో పాటు సంపూర్ణ సుర‌క్ష క్లీనిక్‌లో బాధితుల‌కు అందిస్తున్న సేవ‌ల‌పై ఆరా తీశారు. స్థానిక సెంట‌ర్లో బాధితుల‌కు అందిస్తున్న సేవ‌లు బాగున్నాయ‌న్నారు. సెంట‌ర్‌లో అందిస్తున్న ఉత్త‌మ సేవ‌ల‌కు గాను రాష్ట్రంలోని ఉస్మానియా ఆసుప‌త్రి, వ‌రంగ‌ల్ ఆసుప‌త్రితో పాటు తాండూరు ప్ర‌భుత్వ ఆసుప‌త్రిలోని సుర‌క్ష క్లీనిక్ సెంట‌ర్ మోడ‌ల్ సెంట‌ర్‌గా ఎంపికైంద‌ని తెలిపారు. సెంట‌ర్ ద్వారా ఉత్త‌మ సేవ‌ల‌ను కొన‌సాగించాల‌ని అభిలాషించారు. ఈ కార్య‌క్ర‌మంలో నాకో ఢిల్లీ బృందం ప్ర‌తినిధులు రాజీవ్ సింధు, వేధాంత‌, డాక్ట‌ర్ ముర‌ళిధ‌ర్, టీసాక్స్ ప్ర‌తినిధులు ఆంటోని, సుబ్బ‌ల‌క్ష్మీ, టీబీ హెచ్ఐవీ ప్రోగ్రాం ఆఫీస‌ర్ ర‌వీంద్ర యాద‌వ్, జిల్లా ఆసుప‌త్రి ఆర్ఎంఓ డా. ఆనంద్ గోపాల్ రెడ్డి, ఏఆర్టీ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రమణ బాబు, డా. సమిఉల్లా, డా. కళ్యాణ్ మోహన్ వైద్య సిబ్బంది త‌దిత‌రులు ఉన్నారు.