భూమి నుంచి భారీ శ‌బ్దం

క్రైం తెలంగాణ రంగారెడ్డి వికారాబాద్

భూమి నుంచి భారీ శ‌బ్దం
– భ‌యాందోళ‌న చెందిన ప్ర‌జ‌లు
– భూకంప‌మంటూ అనుమానాలు
వికారాబాద్, ద‌ర్శిని ప్ర‌తినిధి: వికారాబాద్ జిల్లాలో శుక్ర‌వారం భ‌యాందోళ‌న‌కర సంఘ‌ట‌న చోటు చేసుకుంది. జిల్లాలోని పరిగి మండలం రంగాపూర్, రంగాపూర్ తాండాల్లో భూమి నుంచి భారీ శబ్ధం వినిపించిందని స్థానికులు తెలిపారు. భారీ శబ్దానికి భూమి రెండు సెకన్ల పాటు కంపించిందని.. దీంతో ప్రజలు భయభ్రాంతులకు గురై ఇళ్ళ నుండి బయటకు వచ్చామ‌ని తెలిపారు. ఏం జరిగిందనే అయోమయంలో గ్రామస్థులు ఉన్నారు. తుపాకీ పేల్చినట్టు శబ్దం వచ్చి భూమి కుదేసినట్టి అనిపించిందని జనాలు చెబుతున్నారు. విషయం తెలిసిన అధికారులు అక్కడకు చేరుకుని భూకంపమా… మరేమిటని ఆరా తీయ‌డంలో నిమ‌గ్న‌మ‌య్యారు.