హోంగార్డులకు ఖుషీ కబర్..!
– 30 శాతం వేతనాల పెంపు
– వచ్చే జూన్ నుంచి అమలు
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : హోం గార్డులకు తెలంగాణ సర్కారు ఖుషీ ఖుషీలాంటి వార్తను తెలిపింది. ముఖ్యమంత్రి కేసీఆర్ హోంగార్డుల గౌరవవేతనాలను పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా మంగళవారం హోం శాఖ ముఖ్య కార్యదర్శి ఉత్తర్వులను జారీ చేశారు. పోలీసు శాఖలో అతి తక్కువ జీతాలతో పనిచేస్తున్న హోంగార్డుల ఇబ్బందులను అత్యంత మానవత్వంతో అర్థం చేసుకుని ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ చారిత్రక నిర్ణయాలు తీసుకున్నారు. హోంగార్డుల జీతాలు పెంపడంతో పాటు, వారి సంక్షేమం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇంతకుముందే వివిధ ప్రభుత్వ శాఖలు, సంస్థల్లో పని చేస్తున్న ఉద్యోగులను మూడు రకాలుగా విభజించి వేతనాలు నిర్ణయించిన విషయం తెలిసిందే. సీఎం కేసీఆర్ నిర్ణయంతో హోంగార్డులకు 30 శాతం వేతనాలు పెంచుకున్నట్లు జీవో జారి చేయించారు. తాజాగా వీటికి సంబంధించిన స్పష్టతనిస్తూ ఆర్థిక శాఖ జీవో జారీ చేసింది. రిగిన వేతనాలు ఈ ఏడాది జూన్ నుంచి అమలులో రానున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇదిలా ఉండగా ప్రభుత్వం వేతనాలు పెంచడంతో హోంగార్డు సంక్షేమ సంఘం సంతోషం వ్యక్తం చేసింది. ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయంతో హోంగార్డులలో ఆత్మవిశ్వాసం పెరగనుందని అభిప్రాయపడుతున్నారు. వేతనాల పెంపు పట్ల సీఎం కేసీఆర్‌కు, రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.
