రాగి జావాతో రోగాలు పరార్..!
– ఇందులో అద్భుత గుణాలెన్నో
– బీపీ, షుగర్‌లపై ఎలా పనిచేస్తుందంటే..?
దర్శిని డెస్క్ : ఏ కాలంలో అయినా శరీరానికి శక్తినిచ్చేవాటితో పాటు ఆరోగ్యాన్ని అందించే ఆహారాలను తీసుకుంటే శరీరానికి ఎంతో మేలు చేసినవాళ్లమవుతాం. అలాంటి దానికి రాగి జావను తీసుకోవడం మంచి సలహా అని అందరు చెబుతుంటారు. ఒకప్పుడు రాగులు మన జీవన విధానంలో భాగమయ్యాయి. టెక్నాలజీ యుగంలో రాగులు అంటే తెలియనివాళ్లు కూడా ఉన్నారంటే నమ్మాల్సిందే. ఇప్పుడిప్పుడే రాగుల రహస్యం గురించి తెలుసుకుంటున్నారు. తక్కువ ధరలో, అందరికీ సులభంగా లభించే ఈ రాగులతో ఎన్నో అద్భుతగుణాలు దాగి ఉన్నాయి. అత్యధికంగా వినియోగంలో ఉన్న తృణధాన్యాల ఆహారంలో రాగులు కూడా ఒకటి. వీటిలో ఎక్కువగా కాల్షియం, పొటాషియం, కార్పోహైడ్రేట్లు, ఫైబర్, కొవ్వు పదార్థాలు ఉంటాయి. వీటితో పాటు బి విటమిన్లు, ఐరన్ లాంటివి సమృద్ధిగా ఉంటాయి. రాగులను ఎలా తీసుకున్న పలు రోగాలకు చెక్ పెట్టవచ్చని ఆరోగ్య నిపుణులు వెల్లడిస్తున్నారు.
రాగి జావలోని అద్బుత గుణాలు
దీనిని ఉదయం తాగితే రోజంతా ఉత్సహంగా ఉంటారు. రాగి జావ తాగితే రక్తస్రావం తగ్గి..వీర్యకణాల వృద్ధి జరుగుతుంది. బీపీ, షుగర్ వంటి వ్యాధులతో బాధ పడుతున్నారు రాగి జావా తాగడం వల్ల వీటిని కంట్రోల్ అవుతుంది. ఎదిగే పిల్లలకు రాగి జావ పెటిడే మెదడు చురుగ్గా పనిచేస్తుంది. చిన్న పిల్లలకు రాగి జావ తాగించవచ్చని నిపుణులు చెబుతున్నారు. శరీరంలో అధిక వేడి ఉంటే రాగి జావ అద్భుతంగా పని చేస్తుంది. ఈ జావా ప్రతీరోజూ తాగడం వల్ల శరీరానికి చల్లదనాన్ని ఇస్తుంది. ప్రతీరోజూ రాగి జావ తాగితే శారీరక దృఢత్వం పెరుగుతుందని వైద్యులు అంటున్నారు.
ఇలా తయారు చేసుకోవచ్చు..
రాగులను కొంత పరిమాణంలో తీసుకుని వాటిని కొన్ని గంటల పాటు నీటిలో నానబెట్టాలి. అనంతరం వాటిని శుభ్రమైన వస్త్రంలో కట్టి మళ్లీ కొన్ని గంటల పాటు ఉంచితే అవి మొలకెత్తుతాయి. కొన్ని సార్లు రాగులు మొలకెత్తడం ఆలస్యం కూడా అవచ్చు. అయినా కొంత సేపు నిరీక్షించి మొలకెత్తిన రాగులను సేకరించాలి. వాటిని బాగా ఎండబెట్టి దంచి పొడి చేయాలి. ఆ పొడిని కొంత నీటిలో వేసి బాగా ఉడికించాలి. దీంతో జావ తయారవుతుంది. ఇందులో ఇష్టమైనవారు జీడిపప్పు, పల్లీలు, కిస్మిస్, తేనె వంటివి కలుపుకోవచ్చు. లేదంటే ఉప్పు, కారం వేసుకుని ఒక పొంగు వచ్చేవరకూ ఉడికించితే రాగి అంబలి రెడీ అవుతుంది. కావాల్సిన పదార్థాలు ఏంటంటే.. రాగి పిండి రెండు టీ స్పూన్లు, నీళ్లు ఒక కప్పు, పాలు – రెండున్నర కప్పులు, పంచదార- రెండు టేబుల్ స్పూన్లు, బాదం పొడి- రెండు టీ స్పూన్లు, యాలకల పొడి, శొంఠి పొడి అర టీ స్పూన్, కుంకుమపువ్వు చిటికెడు, నెయ్యి లేదా వెన్న ఓ టీ స్పూన్ అవసరం అవుతాయి.
ఇదికూడా చదవండి…

