పాహిమాం భవానీ మాత..!

తాండూరు రాజకీయం వికారాబాద్

పాహిమాం భవానీ మాత..!
– తుల్జాపూర్‌లో అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి
– వేద పండితుల సమక్షంలో అమ్మవారికి పూజలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : పాహిమాం భవానీ మాత అంటూ తుల్జాపూర్లో వెలసిన భవానీ మాత అమ్మ వారిని తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి వేడుకున్నారు. శనివారం షోలాపూర్‌లో అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరైన విషయం తెలిసిందే. ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి అన్నదానం తరువాత అక్కడి నుంచి తుల్జాపూర్ కు చేరుకున్నారు. తుల్జాపూర్ భవానీ మాత ఆలయంలో వెలసిన అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ పురోహితుల సమక్షంలో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి ఆశీస్సులు అందరిపై ఉండాలని అమ్మవారిని వేడుకున్నట్లు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి తెలిపారు. ఎమ్మెల్యే వెంట తాండూరు మార్కెట్ కమిటి చైర్మన్ విఠల్ నాయక్, సీనియర్ నాయకులు పట్లోళ్ల నర్సింలు, శ్రీనివాస్ చారీ, తాండూరు మండల అధ్యక్షులు రాందాస్, భద్రేశ్వరాలయ చైర్మన్ బంటారం సుధాకర్, మార్కెట్ కమిటి వైస్ చైర్మన్ వెంకట్ రెడ్డి, నాయకులు నర్సిరెడ్డి, ఎంపీటీసీ పటేల్ ప్రవీణ్ తదితరులు ఉన్నారు.