సర్కారు బడుల్లో విద్య
– మున్సిపల్ కౌన్సిలర్ సంగీత ఠాకూర్
– విద్యార్థులకు ఏకరూప దుస్తుల పంపిణీ
తాండూరు, దర్శిని ప్రతినిధి : సర్కారు బడుల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యనందిస్తుందని తాండూరు మున్సిపల్ కౌన్సిలర్ సంగీత అజయ్ సింగ్ ఠాకూర్ అన్నారు. బుధవారం తాండూరు మున్సిపల్ పరిధి 20వ వార్డు గాంధీనగర్‌లోని ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు ప్రభుత్వం మంజూరు చేసిన ఏకరూప దుస్తులను పంపిణీ చేశారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థులు బడికి తప్పకుండా రావాలన్నారు. విద్యార్థులకు ఉపాధ్యాయులు గుణాత్మక విద్యనందించాలని సూచించారు. విద్యార్థులు చక్కగా చదువుకోవాలని అన్నారు. ప్రభుత్వం అందజేసిన యూనిఫామ్‌లోనే బడికి రావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం మంజుశ్రీ, ఉపాధ్యాయురాలు మాధవి, విద్యార్థులు పాల్గొన్నారు.

