నాగారం నర్సింలు మరణం బీజేపీకి తీరని లోటు

తాండూరు రాజకీయం వికారాబాద్

నాగారం నర్సింలు మరణం బీజేపీకి తీరని లోటు
– ఆయన స్పూర్తి, ఆశయాలను కొనసాగించాలి
– పార్టీ కార్యాలయంలో నేతల నివాళులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : బీజేపీ పార్టీ ఉమ్మడి జిల్లా సీనీయర్ నాయకులు, తాండూరు మున్సిపల్ మాజీ చైర్మన్ నాగారం నర్సింలు మరణం పార్టీకి తీరని లోటు అని ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు యు.రమేష్ కుమార్ అన్నారు. ఆదివారం తాండూరు పట్టణంలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో నాగారం నర్సింలుకు శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా యు.రమేష్ కుమార్ తో పాటు పార్టీ నేతలు నాగారం నర్సింలు చిత్రపటానికి నివాళులు అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా నాగారం నర్సింలు నడుకుని బీజేపీని బలోపేతం చేశారని అన్నారు. మున్సిపల్ చైర్మన్ గా తాండూరు అభివృద్ధికి కృషి చేశారని అన్నారు. పార్టీ రాష్ట్ర, దేశ నాయకులతో సత్సంబంధాలు కలిగి పార్టీని ముందుకు నడిపించారని అన్నారు. ఆయన మరణం పార్టీకి తీరని లోటు అంటూ బాధ వ్యక్తం చేశారు. ఆయన స్ఫూర్తి, ఆశయాలకు అనుగుణంగా పనిచేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధానా కార్యదర్శి కృష్ణ ముదిరాజ్, బాలి శివకుమార్, జిల్లా కార్యదర్శి బంటారం భద్రేశ్వర్, మాజీ పట్టణ అధ్యక్షులు సుదర్శన్ గౌడ్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి….

తాండూరులో బీజేపీ నేతల జోష్…!