విద్యార్థులకు కంటి ఇన్ఫెక్షన్
– మైనార్టీ స్కూల్లో కలకలం
– ఆసుపత్రికి వెళ్లిన విద్యార్థులు
తాండూరు, దర్శని ప్రతినిధి : తాండూరులోని తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ బాలుర పాఠశాల విద్యార్థులకు కంటి ఇన్ఫెక్షన్ సోకింది. దీంతో విద్యార్థులు ఆసుపత్రికి పరుగులు తీశారు. శనివారం ఈ సంఘటన పాఠశాలలో కంటి కలకలం రేపింది. తాండూరు పట్టణం హైదరాబాద్ రోడ్డు మార్గంలో తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ బాలుర పాఠశాల కొనసాగుతోంది. పాఠశాలకు చెందిన విద్యార్థులు కంటి సమస్యలతో అదే హైదరాబాద్ రోడ్డు మార్గంలోని మాతా శిశు ఆసుపత్రిలో విద్యార్థులు చికిత్స చేయించుకున్నారు. దాదాపు 30 మంది ఆసుపత్రికి వచ్చారు. రెండు, మూడు రోజులుగా విద్యార్థులు కంటి సమస్యలతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. విద్యార్థులు కళ్లు ఎర్రబారడం, నొప్పి సమస్యలతో బాధపడుతున్నట్లు విద్యార్థులు తెలిపారు. కంటి ఇన్ఫెక్షన్ తో బాధపడేవారికి వైద్యులు పరీక్షించారు. ఈ సంఘటనతో విద్యార్థులు ఆందోళనకు గురవుతున్నారు. వివరణ కోరేందుకు స్కూల్ ప్రిన్సిపల్ కు ఫోన్ చేయగా తెలియని కారణాలతో స్పందించలేదు.

