తాండూరు అభివృద్ధికి నిధులు కేటాయించాలి
– దిశ కమిటి సమావేశంలో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మున్సిపల్ అభివృద్ధికి నిధులు కేటాయించేలా చూడాలని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి కోరారు. మంగళవారం వికారాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటి(దిశ) సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశానికి చేవేళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణలు పాల్గొనగా చేవేళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్యతో కలిసి తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్బంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విడుదల చేస్తున్న నిధులపై, పనుల పురోగతిపై సమీక్షించారు. అనంతరం ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడుతూ దిశ కమిటిలో తాండూరు మున్సిపల్ కు ప్రాధన్యాత ఇవ్వాలని కోరారు. మున్సిపల్ కు ప్రత్యేకంగా నిధులు మంజూరయ్యేలా చూడాలని ఎంపీలు కొండా విశ్వేశ్వర్ రెడ్డి, డీకే అరుణలను కొరారు.
ఇదికూడా చదవండి…

