ప్రగతి సారథి పైలెట్ రోహిత్ రెడ్డి

తాండూరు రాజకీయం వికారాబాద్

ప్రగతి సారథి పైలెట్ రోహిత్ రెడ్డి
– డీఎంఎఫ్టీ నిధుల మంజూరు హర్షణీయం
– అంగన్వాడి, డ్వాక్రా భవనాలకు మహర్ధశ
– కృతజ్ఞతలు తెలిపిన వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల దీపా నర్సింలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : సీఎం కేసీఆర్ సహాకారంతో తాండూరు ప్రాంత అభివృద్ధికి ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి చేస్తున్న అభినందనీయని మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల దీపా నర్సింలు అన్నారు. తాజాగా డీఎంఎఫ్టీ ద్వారా మున్సిపల్ కు నిధులు మంజూరు చేయించి ప్రగతి సారథి అయ్యారని అభివర్ణించారు. నిధుల మంజూరుపై హర్షం వ్యక్తం చేస్తూ శనివారం ఆమె ఓ ప్రకటనలో ఎమ్మెల్యే ఎలెట్ రోహిత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. పట్టణంలోని 2వ వార్డులో మరుగుదొడ్లకు రూ. 10 లక్షలు, ఆర్టీసీ బస్టాండ్లో మరుగుదొడ్లకు రూ.5 లక్షలు, గ్రీనరీకి మరో రూ. 5 లక్షలు, 24వ వార్డులో రెండు సీసీ డ్రైన్లకు రూ. 8లక్షలు, 9వ వార్డులో సీసీ డ్రైన్‌కు రూ. 5 లక్షలు. 7వ వార్డులో అంగన్వాడి, డ్వాక్రా భవనానికి రూ. 25 లక్షలు, 8వ వార్డులో అంగన్వాడి, డ్వాక్రా భవనానికి రూ. 25 లక్షలు, 9వ వార్డులో డ్వాక్రా భవనానికి రూ. 15 లక్షలు, 13వ వార్డులో డ్వాక్రా భవనానికి రూ. 15 లక్షలు, 14వ వార్డులో అంగన్వాడి, డ్వాక్రా భవనానికి రూ. 25 లక్షలు, 17వ వార్డులో అంగన్వాడి భవనానికి రూ. 15లక్షలు, 18వ వార్డులో అంగన్వాడి, డ్వాక్రా భవనానికి రూ. 25 లక్షలు, 19 వార్డులో అంగన్వాడీ, డ్వాక్రా భవనానికి రూ. 25 లక్షలు, 20వ వార్డులో అంగన్వాడి, డ్వాక్రా భవనానికి రూ. 25 లక్షలు, 24వ వార్డులో అంగన్ వాడి భవనానికి రూ. 15 లక్షలు, 30వ వార్డులో అంగన్వాడి, డ్వాక్రా భవనానికి రూ. 25 లక్షలు, 32వ వారడ్లో డ్వాక్రా భవనానికి రూ. 15 లక్షలు, 34వ వార్డులో అంగన్ వాడి భవనానికి రూ. 15 లక్షలు, 35వ వార్డులో అంగన్ వాడి భవనానికి రూ. 15 లక్షలు, 36వ వార్డులో వార్డులో అంగన్వాడీ, డ్వాక్రా భవనానికి రూ. 25 లక్షలు పార్టీలకతీతంగా నిధులు మంజూరు చేయించారని తెలిపారు. ఎమ్మెల్యే సహాకారంతో పట్టణంలోని అంగన్ వాడి, డ్వాక్ర సంఘాలకు మహర్థశ అందుతుందన్నారు. తాండూరు నిరంతర అభివృద్ధికి కృషి చేస్తున్న ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి వెన్నంటే ఉండి తోడ్పాటు అందిస్తామని పేర్కొన్నారు.