ట్యాపింగ్ లిస్టులోని ఏఎంసీ చైర్మన్..!

క్రైం తాండూరు రాజకీయం వికారాబాద్

ట్యాపింగ్ లిస్టులోని ఏఎంసీ చైర్మన్..!
– పట్లోళ్ల బాల్ రెడ్డికి సిట్‌ నుంచి కాల్‌
– ఎంక్వైరీకి రావాలని పిలుపు
తాండూరు, దర్శిని ప్రతినిధి : ఫోన్‌ ట్యాపింగ్ వ్యవహారం రోజు రోజుకు ఉత్కంఠతను పెంచుతోంది. ట్యాపింగ్‌కు గురైన ఫోన్‌ నెంబర్ల లిస్టు ఆధారాంగా సిట్‌ అధికారులు సంబంధికులకు కాల్ చేస్తన్నారు. ఈ క్రమంలో తాండూరుకు చెందిన నేతలకు సిట్‌ నుంచి పిలుపులు వస్తున్నాయి. అదికూడా అధికార పార్టీలకు చెందిన నెంబర్లు కావడం గమనార్హం.

ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీకి చెందిన బుయ్యని శ్రీనివాస్ రెడ్డి, డా.సంపత్ కుమార్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ధారాసింగ్, మురళీగౌడ్, ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అనుచరులతో పాటు ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడికి సిట్‌ నుంచి ఫోన్‌ కాల్స్ వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ జాబితాలో మరోకరు చేరారు. తాండూరు వ్యవసాయ మార్కెట్ కమిటి చైర్మన్ పట్లోళ్ల బాల్ రెడ్డికి కూడా సిట్‌ నుంచి కాల్ వచ్చినట్లు తెలిసింది. దీనిని పట్లోళ్ల బాల్ రెడ్డి కూడా దృవీకరించారు.

ప్రస్తుతం పట్లోళ్ల బాల్ రెడ్డి కర్ణాటక రాష్ట్రంలోని మార్కెట్ కమిటిల అధ్యయనానికి వెళ్లారు. శనివారం సాయంత్రం సిట్‌ నుంచి తనకు కాల్ వచ్చినట్లు తెలిపారు. ఫోన్‌ ట్యాపింగ్ విషయంలో విచారణకు హాజరు కావాలని కోరినట్లు వెల్లడించారు. రెండు, మూడు రోజుల్లో విచారణకు హాజరవుతానని చెప్పినట్లు వివరించారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో గత ప్రభుత్వంలో పలువురు రాజకీయ నేతల ఫోన్‌లను ట్యాప్ చేశారని ఆరోపణల నేపథ్యంలో సిట్ విచారణ జరుపుతోంది. ఈ దర్యాప్తులో భాగంగా తాండూరుకు చెందిన నేతలకు కూడా సిట్‌ అధికారుల నుంచి ఫోన్‌ కాల్స్ వస్తున్నాయి. ఇంకా తాండూరు నుంచి ఎంత మందికి ఫోన్‌ కాల్స్ వస్తాయో అని అందరు చర్చించుకుంటున్నారు.

ఇదికూడా చదవండి…

కేవీసీఎస్‌లో యోగా దినోత్సవం..!