నిమజ్ఞానికి నిర్విఘ్న ఏర్పాట్లు

తాండూరు రాజకీయం వికారాబాద్

నిమజ్ఞానికి నిర్విఘ్న ఏర్పాట్లు
– మధ్యాహ్నం నుంచే గణేష్‌ల‌ తరలింపు
– శోభాయాత్ర కోసం 450 మంది పోలీసు బలగాలు
– ఫిర్యాదుల స్వీకరణకు కంట్రోల్ రూం ఏర్పాటు
– తాండూరు డీఎస్పీ జీ. శేఖర్ గౌడ్
తాండూరు, దర్శని ప్రతినిధి : వినాయక నిమజ్జనానికి ఎలాంటి నిర్విఘ్నాలు లేకుండా సజావు ఏర్పాట్లు చేస్తున్నట్లు తాండూరు డీఎస్పీ జీ. శేఖర్ గౌడ్ పేర్కొన్నారు. శనివారం తాండూరు డీఎస్పీ కార్యాలయంలో డీఎస్పీ శేఖర్ గౌడ్ హిందూ ఉత్సవ సమితి గౌరవాధ్యక్షులు రాజుగౌడ్, ప్రధాన కార్యదర్శి పట్లోళ్ల నర్సింలుతో కలిసి మీడియాతో మాట్లాడారు. తాండూరు పట్టణానికి సంబంధించి ప్రతిష్ఠించిన వినాయకుల నిమజ్జనం యాలాల మండలం కోకట్ కాగ్నానదిలో ఏర్పాటు చేసినట్లు స్పష్టం చేశారు. వినాయక నిమజ్జనం కోసం పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నామన్నారు. జిల్లా ఎస్పీ ఎన్.కోటిరెడ్డి పర్యవేక్షణలో 450 మంది పోలీసు అధికారులు, సిబ్బంది బృందంతో శోభాయాత్ర కోసం బందోబస్తు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఇందులో ఒక అడిషనల్ ఎస్పీ, ముగ్గురు డీఎస్పీలు, 10 మంది సీఐలు, 30 మంది ఎస్ఐలు, మిగతా కానిస్టేబుళ్లు బందోబస్తులో పాల్గొంటారని చెప్పారు. అంతేకుండా కొత్తగా కానిస్టేబుల్ పరీక్షలు రాసిన అభ్యర్థులతో పాటు హిందూ ఉత్సవ సమితి వాలంటీర్లు కూడ పాల్గొంటారని వివరించారు. అయితే వినాయక నిమజ్జన వేడుకలను ఆదివారం మధ్యాహ్నం 12 గంటల నుంచే ప్రారంభించాలని సూచించారు. అందరు ఐక్యమత్యం, సామరస్యతను కొనసాగిస్తూ నిమజ్జనం సజావుగా సాగించేందుకు సహకరించాలన్నారు. శోభాయాత్రలో, నిమజ్జన ప్రాంతాలలో ఏమైనా ఇబ్బందులు జరిగితే ఫిర్యాదు చేసేందుకు ప్రత్యేక కంట్రోల్ రూం కూడ ఏర్పాటు చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. ఇందులో పోలీసు(సెల్: 830952353), మున్సిపల్ సెల్: 9398824423), విద్యుత్ (సెల్: 9440819597), ఫైర్ (సెల్: 8688658516) మెడికల్ శాఖల సిబ్బంది పర్యవేక్షిస్తారని, ఎలాంటి ఇబ్బందులు ఫిర్యాదులు చేయొచ్చని సూచించారు. మ‌రోవైపు హిందూ ఉత్స‌వ స‌మితి గౌర‌వాధ్య‌క్షులు రాజుగౌడ్, ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ప‌ట్లోళ్ల న‌ర్సింలులు మాట్లాడుతూ ప్ర‌తి యేడాది మాదిరిగానే ఈ యేడాది కూడ నిమ‌జ్జ‌న ఉత్స‌వాలు ప్ర‌శాంతంగా జ‌రిగేలా స‌హ‌క‌రించాల‌న్నారు. వినాయ‌కుల‌ను త్వ‌ర‌గా త‌ర‌లించాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు. ఆటా పాట‌లు, సంప్ర‌దాయ బ‌ద్దంగా నిమ‌జ్జ‌న ఉత్స‌వాలు జ‌రుపుకోవాల‌న్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ యువనాయకులు శివానంద్, హిందూ ఉత్సవ సమితి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.