పేదల ఆరోగ్యానికి సీఎంఆర్ఎఫ్‌ భరోసా

ఆరోగ్యం తాండూరు రంగారెడ్డి రాజకీయం వికారాబాద్

పేదల ఆరోగ్యానికి సీఎంఆర్ఎఫ్‌ భరోసా
– ఎల్‌ఓసీలను అందజేసిన ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి: తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సీఎంఆర్ఎఫ్‌(సీఎం సహాయనిధి) పథకం పేదల ఆరోగ్యానికి భరోసా అందిస్తుందని ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి అన్నారు. సీఎంఆర్ఎఫ్ పథకం కింద తాండూరు మున్సిపల్ పరిధికి చెందిన జయశీలకు రూ.60వేలు, యాలాల మండలం విశ్వనాథ్ పూర్ గ్రామానికి చెందిన గ్రామానికి చెందిన రాజేందర్ రెడ్డికి రూ.24 వేలు మంజూరయ్యాయి. గురువారం ఎమ్మెల్సీ క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి చేతుల మీదుగా లబ్దిదారులకు ఎల్ఓసీలను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ సీఎంఆర్ఎఫ్ పథకం ఎంతో మంది పేదలకు ఆర్థిక చేయూత అందించి వారి ఆరోగ్యాలకు భరోసా కల్పించిందన్నారు. అర్హులైన పేదలు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్, డీసీసీబీ ఉమ్మడి జిల్లా డైరెక్టర్ రవీందర్ గౌడ్, టీఆర్ఎస్ పట్టణ మాజీ అధ్యక్షులు అబ్దుల్ రవూఫ్, మాజీ డీపీసీ సభ్యులు పట్లోళ్ల నర్సింలు, కౌన్సిలర్లు రజాక్, ప్రవీణ్ గౌడ్, రాము, వెంకన్న గౌడ్, మాజీ కౌన్సిలర్ జుబేర్ లాల, సీనియర్ నాయకులు సాయిపూర్ బాల్ రెడ్డి, యువనాయకులు బిర్కడ్ రఘు, పునీత్ కుమార్, కోట్ల రాజ్ కుమార్, సిద్దు తదితరులు పాల్గొన్నారు.