ఈతకు వెళ్లి యువకుడి మృతి
– చెరువులో గల్లంతైన మృతదేహం వెలికితీత
– పెద్దేముల్ మండలంలో విషాదం
పెద్దేముల్, దర్శిని ప్రతినిధి: స్నేహితులతో కలిసి సరదాగా చెరువులో ఈతకు వెళ్లిన యువకుడు ప్రమాద వశాత్తు నీటమునిగి మృతి చెందాడు. ఈ సంఘటన వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలంలో చోటు చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దేముల్ మండల కేంద్రానికి చెందిన శ్రీనివాస్ ఆదివారం తన స్నేహితులతో కలిసి అదే మండలం మంబాపూర్ గ్రామంలోని చెరువులో ఈత కోసం వెళ్లాడు. చెరువులో దూకిన శ్రీనివాస్ నీళ్లు ఎక్కువగా ఉన్న ప్రదేశంలోని వెళ్లడంతో ప్రమాద వశాత్తు మునిగిపోయాడు. స్నేహితులు కాపాడేందుకు యత్నించినా ఫలితం లేకుండా పోయింది. చివరకు విషయాన్ని గ్రామస్తులకు, పోలీసులకు తెలపడంతో సంఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు.
చివరకు శ్రీనివాస్ మృతదేహంగా లభ్యమయ్యాడు. శ్రీనివాస్ మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తాండూరులోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఇదికూడా చదవండి…

