భారత రాజ్యాంగం ఎంతో గొప్పది

కెరీర్ తాండూరు రాజకీయం వికారాబాద్

భారత రాజ్యాంగం ఎంతో గొప్పది
– అన్ని వర్గాలవారికి సమన్యాయం
– వికారాబాద్‌ జిల్లా గ్రంథాలయ చైర్మన్ రాజుగౌడ్
– జిల్లా గ్రంథాలయంలో రాజ్యాంగ దినోత్సవం
వికారాబాద్‌, దర్శిని ప్రతినిధి: ప్రపంచంలో అన్నిటికైనా భారత రాజ్యాంగం ఎంతో గొప్పదని, దాని వల్లే అన్ని వర్గాలకు సమన్యాయం అందుతుందని వికారాబాద్‌ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజుగౌడ్ అన్నారు. శనివారం వికారాబాద్‌ జిల్లా కేంద్రంలోని గ్రంథాలయ కార్యాలయంలో భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు.

గ్రంథాలయ చైర్మన్ రాజుగౌడ్ హాజరై భారత రాజ్యాంగ నిర్మాత డా.బీఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డా.బీఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం 1949 నవంబర్ 26న ఆమోదం పొందిందన్నారు. ప్రపంచంలో గొప్పదైన రాజ్యాంగాన్ని రచించిన ఘనత అంబేద్కర్‌కే దక్కుతుందన్నారు. ఆయన రచించిన రాజ్యాంగంతోనే అన్ని వర్గాల ప్రజలకు సమన్యాయం అందుతుందన్నారు. దేశంలో అన్ని మతాలు, కులాలకు సమర్థవంతమైన పాలన అందుతుందంటే రాజ్యాంగం చలువే అన్నారు. రాజ్యాంగాన్ని అందరు గౌరవించాలని.. అందుకు లోబడి నడుచుకోవాలన్నారు. మరోవైపు వికారాబాద్‌ జిల్లా గ్రంథాలయ కేంద్రంలో కాన్ట్సీటూషన్ అఫ్ ఇండియా పుస్తకం ఉండడంతో గర్వకారణమన్నారు. ఈ కార్యక్రమంలో గ్రంథపాలకులు, నిర్వహకులు, పాఠకులు తదితరులు పాల్గొన్నారు.