గొల్ల చెరువులో కబ్జాలు..!

తాండూరు రాజకీయం వికారాబాద్

గొల్ల చెరువులో కబ్జాలు..!
– శిఖం భూముల్లో నిర్మాణలు
– పట్టించుకోని అధికారులు..?!
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలోని ఏకైక జలాశయం గొల్ల చెరువు కబ్జా కోరల్లోకి వెళుతోంది. చెరువు శిఖం భూముల్లో యధేచ్చగా ఇళ్ల నిర్మాణాలు జరుగుతున్నాయి. ఈ నిర్మాణాలపై అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
kvcs
తాండూరు పట్టణంలోని ఏకైక జలాశయం గొల్ల చెరువును ఓ వైపు అభివృద్ది చేయాలని ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంటే కబ్జాలో చిక్కుకుపోవడం చర్చనీయాంశంగా మారింది. గొల్ల చెరువులో కబ్జాల పర్వంపై ఈ ఆరోపణలు కొత్తగా వస్తున్నవేమి కాదు. గతంలో స్వయంగా ఇరిగేషన్ అధికారులే శాటిలైట్ సర్వే చేసి చెరువు శిఖం భూములు కబ్జాకు గురైనట్లు గుర్తించారు. అప్పట్లో సుమారు 10 ఎకరాల వరకు చెరువు కబ్జాకు గురైనట్లు తేల్చారు. ఈ కబ్జాలకు అప్పుడే అధికారులు చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. కాని నేటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు.

కొన్ని నెలల తరువాత చెరువు శిఖం భూముల్లో మళ్లీ కబ్జాలు ప్రారంభమయ్యాయి. ఇళ్లు నిర్మించుకున్న కొందరు వ్యక్తులు చెరువు పరిధిలోని సర్వేనెంబర్‌కు బై నెంబర్లు వేసుకుని నిర్మించుకున్న ఇళ్లను రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఈ విషయంలో బీజేపీ నేతలు తీవ్ర ఆరోపణలు చేయడంతో పాటు అధికారులకు కూడా ఫిర్యాదులు చేశారు. తాజాగా మళ్లీ చెరువు శిఖం భూముల్లో కొందరు వ్యక్తులు కబ్జాలకు పాల్పడడమే కాకుండా యధేచ్చగా ఇళ్ల నిర్మాణాలను చేపుడున్నారు. ఫ్లాట్లుగా ఏర్పాటు చేసుకుని ఎలాంటి అనుమతులు లేకుండానే నిర్మాణ పనులు సాగిస్తున్నారు. చెరువు కబ్జాలకు గురికావడంతో మత్య్సకారుల సంఘం నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కబ్జాలకు గురైన గొల్ల చెరువును కాపాడాలంటూ అధికారులకు ఫిర్యాదులు చేశారు. ఇప్పటికైనా గొల్ల చెరువు కబ్జాలపై అధికారులు స్పందిస్తారో లేదో వేచిచూడాలి.

ఇదికూడా చదవండి….

బిర్యానీ అర్డర్‌కు బొద్దింక ప్రీ..!