కారులో కుంపటి..!
– పార్టీ వీడేందుకు సిద్దమన్న ఎమ్మెల్సీ వర్గం
– రాజీనామా కూడ చేస్తామని హెచ్చరిక
– కారణమేంటో చెప్పిన కౌన్సిలర్లు
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు నియోజకవర్గం కారులో మరోసారి కుంపటి రగిలింది. మున్సిపల్‌కు చెందిన ఎమ్మెల్సీ వర్గం కౌన్సిలర్లు, నాయకులు పార్టీ వీడేందుకు సిద్దంగా ఉన్నామని బాంబు పేల్చారు. అవసరమైతే కౌన్సిలర్ల పదవులకు రాజీనామా చేస్తామని హెచ్చరించారు. ఈ పరిణామాలు తాండూరు రాజకీయాలలో తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. ఆదివారం తాండూరు మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ నివాసంలో పార్టీ రాష్ట్ర నాయకులు కరణం పురుషోత్తం రావు, సీనీయర్ నాయకులు పట్లోళ్ల నర్సింలు, తాటికొండ పరిమళ్ గుప్త, మాజీ కౌన్సిలర్ జుబేర్‌లాల, కౌన్సిలర్లు సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా నాయకులు, కౌన్సిలర్లు కరణం పురుషోత్తం రావు ముందు ఆవేధన వ్యక్తం చేశారు. అధికార పార్టీలో ఉన్న ప్రతిపక్ష పార్టీలో కొనసాగుతున్నట్లు ప్రస్తుత కౌన్సిలర్ల తీరు ఉందని చెప్పుకొచ్చారు. మున్సిపల్లో ఇంచార్జ్ కమీషనర్‌ను మార్చాలని, కొత్త కమీషనర్, సిబ్బందిని నియమాలని డిమాండ్ చేశారు. వారు లేక వార్డుల్లో అభివృద్ధి పనులు జరగడం లేదని అన్నారు. పరిస్థితి ఇలాగే ఉంటే పార్టీ వీడేందుకు సిద్దంగా ఉన్నామని, అవసరమైతే కౌన్సిలర్ల పదవులకు రాజీనామా చేస్తామని హెచ్చరించారు. దీనిపై కరణం పురుషోత్తం రావు నేతలు, కౌన్సిలర్లు సముదాయించారు. పార్టీలో నిరుత్సాహాంగా ఉన్న నేతలతో కలిసి ఆత్మీయ సమ్మేళనం నిర్వహించి.. భవిష్యత్తు కార్యాచరణ చేపడుతామని నచ్చజెప్పినట్లు నేతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు అబ్దుల్ రజాక్, రాము, బోయరవి, కోఆప్షన్ సభ్యులు అబ్దుల్ ఖవి తదితరులు ఉన్నారు.

