తెలంగాణలో గ్రూప్‌-4 కొలువుల జాతర

ఆరోగ్యం కెరీర్ తెలంగాణ మహబూబ్ నగర్ రాజకీయం వికారాబాద్ హైదరాబాద్

తెలంగాణలో గ్రూప్‌-4 కొలువుల జాతర
– 9,168 పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదల
– దరఖాస్తుల గడువు ఎప్పటి వరకు అంటే
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి: తెలంగాణ రాష్ట్రంలో కొలువుల జాతర మొదలైంది. కొద్ది సేపటి క్రితమే వైద్య పోస్టుల భర్తికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన సర్కారు వెంటనే గ్రూప్‌ -4కు సంబంధించి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసి బంపర్ ఆఫర్ అందించింది. గత బడ్జెట్‌ సమావేశాల్లోనే రాష్ట్రంలో గ్రూప్‌-4కు సంబంధించిన 9168 పోస్టులను భర్తి చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. గ్రూప్‌-4లో జిల్లా కార్యాలయాల్లో జూనియర్‌ అసిస్టెంట్‌, అకౌంటెంట్‌, జువైనల్‌ సర్వీసెస్‌ సూపర్‌ వైజర్‌ మేల్‌, జువైనల్‌ సర్వీసెస్‌ మ్యాట్రన్‌ స్టోర్‌ కీపర్‌, సాంకేతిక విద్యాశాఖ మ్యాట్రన్‌ పోస్టులు చేర్చినట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. తాజాగా టీఎఎస్‌పీఎస్సీ విడుదల చేసిన గ్రూప్‌-4 నోటిఫికేషన్‌లో జూనియర్‌ అసిస్టెంట్‌, జూనియర్‌ అకౌంటెంట్‌, జూనియర్‌ ఆడిటర్‌, వార్డ్‌ ఆఫీసర్‌ పోస్టులు భారీగా ఉన్నాయి. గ్రూప్‌-4లో మరో 4 రకాల పోస్టులను ప్రభుత్వం చేర్చింది. ఈమేరకు గతంలో ఇచ్చిన ఉత్వర్వులను ఇటీవలే సాధారణ పరిపాలన శాఖ సవరించింది. పోస్టులకు అనుగుణంగా టీఎస్‌పీఎస్‌సీ ద్వారా నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈనెల 23 నుంచి జనవరి 12 వరకు దరఖాస్తులు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నట్టు తెలిపింది. ఏప్రిల్‌ లేదా మే నెలలో పరీక్ష నిర్వహించనున్నట్టు అధికారులు వెల్లడించారు.

నోటిఫికేషన్ జారీ పోస్టుల వివరాలు..
* పట్టణాభివృధ్ధి, పురపాలిక విభాగంలో 2,701 పోస్టులు.
* రెవెన్యూ శాఖలో 2,077 పోస్టులు.
* పంచాయతీరాజ్‌ శాఖలో 1,245 పోస్టులు.
* ఉన్నత విద్యాశాఖలో 742 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ వెలువడింది.