ఆలయాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి

తాండూరు రాజకీయం వికారాబాద్

ఆలయాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి
– ఏకాంబరి రామలింగేశ్వరస్వామి ఆలయానికి రూ.1 కోటి
– ఆలయంలో మౌలిక సదుపాయాలకు ప్రణాళికలు
– దర్శించుకుని పూజలు చేసిన ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి: దేవాలయాల అభివృద్ధికి తెలంగాణ సర్కారు కృషి చేస్తుందని తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి పేర్కొన్నారు. గ్రామాలను అభివృద్ధి చేయడంలో భాగంగా ప్రణాళికలు సిద్దం చేయడం కోసం ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి పల్లె పల్లెకు పైలెట్ కార్యక్రమాన్ని రెండో దశకు శ్రీకారం చుట్టారు. ఈ మేరకు సోమవారం తాండూరు నియోజకవర్గం బషీరాబాద్‌ మండలం నీళ్ళపల్లి ఏకాంబరి రామలింగేశ్వరస్వామి ఆలయం నుంచి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆలయంలో వెలసిన రామలింగేశ్వరున్ని ఎమ్మెల్యే దర్శించుకుని పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రామలింగేశ్వర ఆలయ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి కోటి రూపాయలు మంజూరు చేయిస్తామని అన్నారు . ఈ నిధులతో ఆలయంలో మౌలిక సదుపాయాలు కల్పిస్తామని అన్నారు. అంతకుముందు దేవస్థానాన్ని సందర్శించిన ఎమ్మెల్యే కమిటీ సభ్యులతో సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మరోవైపు ఆలయానికి కోటి రూపాయలు మంజూరు చేసినందుకు కమిటీ సభ్యులు, గ్రామస్థులు సంతోషం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలిపారు. ఎమ్మెల్యే వెంట టీఆర్ఎస్ బషీరాబాద్ మండల అధ్యక్షులు రాములు నాయక్, పీఏసీఎస్ చైర్మన్ వెంకట్రామ్ రెడ్డి, నాయకులు నర్సిరెడ్డి, ప్రజా ప్రతినిధులు, నేతలు తదితరులు ఉన్నారు.