గురువుల అంకిత భావం ఆదర్శనీయం..!

తాండూరు రాజకీయం వికారాబాద్

గురువుల అంకిత భావం ఆదర్శనీయం..!
– బదిలీ ఉపాధ్యాయులకు ఘన వీడ్కోలు
– సన్మానించిన జక్కెపల్లి గ్రామస్తులు
యాలాల, దర్శిని ప్రతినిధి : అంకితభావంతో పనిచేసిన గురువుల సేవలు ఆదర్శంగా నిలుస్తాయని యాలాల మండలం జక్కెపల్లి గ్రామస్తులు అన్నారు. జక్కెపల్లి గ్రామంలో కొన్నేళ్లుగా పనిచేసిన ఉపాధ్యాయులు బి. ఆశప్ప, లీలావతి, అంబదాస్, విద్యారాణిలు బదిలీపై వెళ్లారు. దీంతో గురువారం బదిలీపై వెళ్లిన ఉపాధ్యాయులకు వీడ్కోలు, సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. గ్రామస్తుల సమక్షంలో నేతలు, ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ బదిలీపై వెళ్లిన ఉపాధ్యాయుల సేవలను కొనియాడారు.

పాఠశాలలో విద్యార్థులకు చక్కని విద్యనందించడమే కాకుండా విలువలు నేర్పారని అన్నారు. అంకిత భావంతో పనిచేసి గ్రామస్తుల మనసులు గెలుచుకున్నారని అన్నారు. వారు ఎక్కడికి వెళ్లిన అదే అంకిత భావంతో పనిచేయాలని, వారి స్పూర్తితో ఇక్కడి ఉపాధ్యాయులు పనిచేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచ్ నారాయణ, యాదిరెడ్డి, మహిపాల్, గణేష్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు చంద్రయ్య, ఉపాధ్యాయులు శ్రీనివాస్, మంజుల, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

స్వచ్ఛదనం – పచ్చదనం సక్సెస్సే టార్గెట్..!