గోమాత సేవలో పైలెట్
– సన్మానించిన గోశాల సభ్యులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి బుధవారం తాండూరులోని సీతారాంపేట్ లో ఉన్న గోశాలను సందర్శించారు. అరగంట పాటు గోసేవలో పాల్గొన్నారు. గోవులకు ఆకుకూరలు..పశుగ్రాసం తినిపించారు. గోశాలలోని శ్రీక్రిష్ణుడి విగ్రహంకు పూజలు చేశారు. గోశాలలో జరుగుతున్న కార్యక్రమాలను అధ్యక్షులు వేణుగోపాల్ రెడ్డి, కోశాధికారి ఓం ప్రకాష్ సోమానికి అడిగి తెలుసుకున్నారు. గోశాలలో చాలా మార్పు వచ్చిందని..చక్కగా నిర్వహిస్తున్నారని నిర్వాహకులను ఎమ్మెల్యే ప్రశంసించారు. గోసేవ నిమిత్తం గోశాలకు వచ్చిన ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిని గోశాల అధ్యక్షులు, కోశాధికారి సన్మానించారు. ఎమ్మెల్యే వెంట అయ్యప్ప స్వాములు పటేల్ ప్రవీణ్, మంకాల్ రఘు, సంతోష్ గౌడ్, గుండప్పలు ఉన్నారు.


