సీసీఐ రాములుకు నివాళులు అర్పించిన ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి
– పరామర్శించిన పలువురు నాయకులు
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరుకు చెందిన సీనీయర్ దళిత నాయకులు సీసీఐ రాములకు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి నివాళులు అర్పించారు. అనారోగ్యంతో బాధపడుతున్న సీసీఐ రాములు ఆదివారం కన్నుమూశారు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి తాండూరు పట్టణం మాణిక్ నగర్‌లో సీసీఐ రాములు నివాసానికి చేరుకున్నారు.
సీసీఐ రాములు పార్దివ దేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. ఎమ్మెల్సీ వెంట డీసీసీబీ జిల్లా డైరెక్టర్, పీఏసీఎస్ చైర్మెన్ సంగెం రవీందర్ గౌడ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వడ్డే శ్రీనివాస్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బొబ్బిలి శోభారాణి, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు పట్లోళ్ళ నర్సింలు, పట్లోళ్ళ బాల్ రెడ్డి, సంజీవ్ రావు, బంటు మల్లప్ప, బిర్కడ్ రఘు, అశోక్ మంతన్ గౌడ్, దత్తాత్రేయ రబ్బానీ తదితరులు ఉన్నారు.
పరామర్శించిన పలువురు నాయకులు
మరోవైపు సీసీఐ రాములు మృతిపట్ల పలువురు నాయకులు సంతాపం తెలిపారు. డీసీసీబీ మాజీ చైర్మన్ లక్ష్మారెడ్డి, మార్కెట్ కమిటి మాజీ చైర్మన్ నారా మహిపాల్ రెడ్డి, సర్దార్ ఖాన్ తదితరులు సీసీఐ రాములు భౌతిక ఖాయానికి నివాళులు అర్పించారు.
అదేవిధంగా కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు, కౌన్సిలర్ ప్రభాకర్ గౌడ్, టీపీసీసీ ఎస్సీ సెల్ ఉపాధ్యక్షులు హేమంత్, యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కావలి సంతోష్ తదితరులు సీసీఐ రాములుకు నివాళులు అర్పించారు.


