మన పట్టణం – మన బడి వేగవంతం

ఆరోగ్యం తాండూరు వికారాబాద్

మన పట్టణం – మన బడి వేగవంతం
– వార్డుకో టీపార్కు, నర్సరీ ఏర్పాటు
– పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలి
– జిల్లా ఆడిషనల్ కలెక్టర్ రాహుల్ శర్మ
తాండూరు, దర్శిని ప్రతినిధి : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మన పట్టణం మన బడి కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని వికారాబాద్ జిల్లా అడిషనల్ కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు. సోమవారం తాండూరు మున్సిపల్ పరిధి సాయిపూర్ లోని ప్రభుత్వ నెంబర్ 1 పాఠశాలను అడిషనల్ కలెక్టర్ రాహుల్ శర్మ సందర్శించారు. మన పట్టణం – మన బడి కింద చేపడుతున్న పనుల గురించి ఆరా తీశారు. పనులు ఏయే దశలో ఉన్నాయని ఎంఈఓ వెంకటయ్య గౌడ్ ను అడిగి తెలుసుకున్నారు. కిచెన్ షెడ్ నిర్మాణం ఆలస్యం జరుగుతుందని చెప్పడంతో పనులను వేగవంతం చేయాలని, అందుకు సంబంధించిన బిల్లులను నిబంధనల మేరకు చెల్లిస్తామని కాంట్రాక్టర్ తో స్పష్టం చేశారు. అదేవిధంగా పాఠశాల గదులకు కీటికీలు, ఎలక్ట్రిషన్ తదితర పనులను వేగవంతం చేసి పూర్తి చేయాలని ఆదేశించారు. అదేవిధంగా అడిషనల్ కలెక్టర్ రాహుల్ శర్మ మున్సిపల్ పరిధిలోని ట్రీ పార్కుతో పాటు ఆదర్శ నగర్, ఎన్టీఆర్ కాలనీలోని క్రీడా ప్రాంగణాలను పరిశీలించారు. ఈ సందర్భంగా వార్డుకో ట్రీ పార్కు, నర్సరీలను ఏర్పాటు.. చేసేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచినచారు. అక్కడి నుంచి పాత తాండూరులో అందుబాటులోకి వచ్చిన బస్తీ దవాఖానను కూడ సందర్శించి వైద్య సేవలపై ఆరా తీశారు. రోగులకు ఉన్న వసతులలో మెరుగైన వైద్య సేవలను అందించాలని వైద్యులను, సిబ్బందిని ఆదేశించారు. దీంతో పాటు పట్టణంలోని పలు ప్రాంతాలలో పర్యటించి పారిశుద్ధ్యంను పర్యవేక్షించారు. పారిశుద్ధ్య పనులు అస్తవ్యస్తంగా ఉండడంతో అసంతృప్తి వ్యక్తం చేశారు. అడిషనల్ కలెక్టర్ వెంట స్పెషల్ ఆఫీసర్ వినయ్ కుమార్, మున్సిపల్ మేనేజర్ నరేందర్ రెడ్డి, ఏఈ ఖాజా హుస్సేన్, టీపీఎస్ మాచెయ్య, ఎన్విరాల్ మెంట్ ఇంజనీర్ ప్రవీణ్ తదితరులు ఉన్నారు.