ఆత్మరక్షణ విద్యలతో క్రమశిక్షణ

క్రీడలు తాండూరు రాజకీయం వికారాబాద్

ఆత్మరక్షణ విద్యలతో క్రమశిక్షణ
– బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు కె. రాజ్ కుమార్
– క్రీడాకారులు అంతర్జాతీయంగా రాణించాలి
తాండూరు, దర్శిని ప్రతినిధి: ఆత్మరక్షణ విద్యలతో క్రమ శిక్షణను పెంపొంతుందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు, తాండూరు నియోజకవర్గ కన్వీనర్ కందుకూరి రాజ్ కుమార్ అన్నారు. ఇటీవల రాష్ట్రస్థాయిలో జరిగిన తైక్వాండో పోటీలో తాండూరుకు చెందిన మాస్టర్ దోమ రవి ఆధ్వర్యంలో క్రీడకారులు పాల్గొని ప్రతిభ కనబరిచారు. ఇందులో భాగంగా ఆదివారం తాండూరు పట్టణంలోని శిశు మందిర్ పాఠశాలలో క్రీడాకారులకు అభినందన సభ ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి రాజ్ కుమార్ హాజరై పోటీలో సత్తా చాటిన క్రీడాకారులు సంద్యారాణి, మహాలక్ష్మి, అనంతలక్ష్మి, కీర్తన, అక్షయ, రిషిత, భాను ప్రసాద్, మణికంఠ, కిషోర్, వర్షిత్, అమాన్, రాజేష్, ప్రజ్వల్ చంద్రవేణులకు పథకాలను అందజేసి అభినందించారు. ఈ సందర్భంగా రాజ్ కుమార్ మాట్లాడుతూ ఆత్మరక్షణ విద్యలు కరాటే, తైక్వాండోలకు ఎంతో ప్రాధాన్యముందన్నారు. ఈ విద్యల వల్ల ఆత్మరక్షణతో పాటు క్రీడాకారుల్లో క్రమశిక్షణ పెంపొందుతుందన్నారు. ఈ విద్యల్లో రాణించి క్రీడాకారులు తాండూరు నుంచి అంతర్జాతీయ స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. క్రీడాకారులకు ప్రోత్సహాం అందిస్తున్న శిశు మందిర్ పాఠశాల యజమాన్యం, కరస్పాండెంట్ అనంత్ రెడ్డిలకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘం జిల్లా నాయకులు గడ్డం వెంకటేష్, సోషల్ మీడియా ఇంచార్జ్ బస్సు, మ హేందర్, రాము ముదిరాజ్, జుంటుపల్లి వెంకట్, కల్వ వంశీ, రమేష్, అశోక్, సంగమేష్, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.