సర్కారుకు రోజులు దగ్గరపడ్డాయి

క్రైం తాండూరు రాజకీయం వికారాబాద్

సర్కారుకు రోజులు దగ్గరపడ్డాయి
– కాంగ్రెస్ నేతల అరెస్టులు అప్రజాస్వామికం
– తాండూరులో కాంగ్రెస్ నేతల ముందస్తు అరెస్టులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : రాష్ట్రంలో నిరంకుశత్వ పాలన చేస్తున్న తెలంగాణ సర్కారుకు రోజులు దగ్గర పడ్డాయని తాండూరు కాంగ్రెస్ నేతలు అన్నారు. సర్పంచుల నిధుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఆవంభిస్తున్న వైఖరికి వ్యతిరేకంగా సోమవారం హైదరాబాద్ ఇందిరా పార్కు వద్ద టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి పిలుపు మేరకు దర్నా చేపట్టారు. ఈ దర్నాకు వెళ్లకుండా తాండూరు పోలీసులు తెల్లవారు జాము నుంచి కాంగ్రెస్ నేతలను అరెస్టు చేశారు. కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు ప్రభాకర్ గౌడ్, యూత్ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు బంటు వేణుగోపాల్, తాండూరు నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి కావలి సంతోష్ కుమార్ ఇతర నాయకులను వారి నివాసాల వద్ద అరెస్టు చేసి పట్టణ పోలీస్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా అక్రమ అరెస్టులపై నేతలు నిరసన వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వానికి, సీఎం కేసీఆర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ రాష్ట్రంలో నిరంకుశత్వ పాలన చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ ఆహాంకారమే… నిండా ముంచుతుందని అన్నారు. రాష్ట్రంలో సర్కారుకు రోజులు దగ్గరపడ్డాయన్నారు. ఎన్ని అరెస్టులు చేసినా వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న ప్రభుత్వంపై పోరును ఆపేది లేదని హెచ్చరించారు.