భక్తి శ్రద్ధలతో అయ్యప్ప ఇరుముళ్లు…!

తాండూరు రాజకీయం వికారాబాద్

భక్తి శ్రద్ధలతో అయ్యప్ప ఇరుముళ్లు…!
– శబరికి బయల్దేరిన అయ్యప్ప స్వాములు
– మణికంఠ ఆశ్రమంలో మార్మోగిన నామస్మరణ
తాండూరు, దర్శిని ప్రతినిధి: నలభై ఒక్క రోజుల పాటు కఠిన నియమాలతో అయ్యప్ప దీక్షను పూర్తి చేసిన అయ్యప్ప స్వాములు భక్తిశ్రద్ధలతో ఇరుముళ్లు సిద్ధం చేసుకున్నారు. మంగళవారం తాండూరు మున్సిపల్ పరిధి పాత తాండూరు శ్రీ వేంకటేశ్వర దేవాలయంలోని మణికంఠ ఆశ్రమం అయ్యప్ప నామస్మరణతో మార్మోగింది. ఆశ్రమానికి చెందిన గురుస్వాములు కిరణ్ పటేల్, వెంకటేష్, పీటీ వెంకట్, గుండప్ప, ధన్ రాజ్, నరేష్ (జానీ), రవిప్రసాద్ తో పాటు పలువురు స్వాములతో 33 మంది స్వాములు ఇరుముళ్లు కట్టుకున్నారు. వేద మంత్రాల మంత్రోచ్చరణలో ఇరుముళ్లు కట్టుకుని శబరికి బయల్దేరారు. అంతకుముందు ఆశ్రమంలో అయ్యప్ప స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అయ్యప్ప స్వామి నామస్మరణతో ఆలయం మార్మోగింది. అదేవిధంగా శబరికి బయల్దేరిన స్వాములను కుటుంబ సభ్యులు, భక్తులు పాదాభివందనం చేసి మొక్కులు తీర్చుకున్నారు. అయ్యప్ప స్వాములు తలపై ఇరుముళ్లను పెట్టుకుని మణికంఠ నామస్మరణతో ముందుకు సాగారు