హడలెత్తించిన చైన్ స్నాచర్లు
– హైదరాబాద్‌లో 2 గంటల్లో 6 చోరీలు
– గంటలోనే పట్టుకున్న పోలీసులు
హైదరాబాద్, దర్శని ప్రతినిధి: హైదరాబాద్ మహానగరంలో చైన్ స్నాచర్లు హడలెత్తించారు. సీటిలోకి ఎంటర్ అయిన చైన్‌స్నాచర్లు 2 గంటల్లో 6 చోరీలు చేశారు. వరుసగా దొంగతనాలు చేసి కనిపించకుండా పారిపోయిన దొంగలను పోలీసులు గంటలోనే అదుపులోకి తీసుకున్నారు. శనివారం జరిగిన వరుస దొంగతనాలతో హైదరాబాద్, సికింద్రాబాద్ పరిధి ప్రజలు ఉలిక్కి పడ్డారు. ఉప్పల్ నుంచి మొదలై హబ్సీగూడ మీదుగా సికింద్రాబాద్ వరకూ స్నాచింగ్‌లు చేస్తూ వచ్చారు. అది కూడా ప్రతి 20 నిమిషాలకు ఒక స్నాచింగ్ చొప్పున చేస్తూ వచ్చారు. నాచారంలోని నాగేంద్రనగర్‌లో, ఓయూ పరిసరాల్లోని రవీంద్రనగర్‌లో, చిలకలగూడ రామాలయం వీధిలో, రాంగోపాల్ పేట్ పరిధిలో మాస్కులు ధరించిన దొంగలు చైన్ స్నాచింగ్ కు పాల్పడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు వారిని పట్టుకునేందుకు రంగంలోకి దిగారు. ప్రజలను అప్రమత్తం చేశారు. 12 బృందాలతో కూడిన పోలీసులు దొంగతనాలు జరిగిన రూట్లోని సీసీ ఫుటేజ్‌లను గాలింపులు చేపట్టారు. ఉప్పల్ మాస్టర్ చెఫ్ సమీపంలో దుండగులు మహిళ మెడలో నుంచి బంగారం చైన్ లాక్కెళ్లారు. అనంతరం ఉప్పల్ కళ్యాణపురిలో ఉదయం వాకింగ్ కు వెళుతున్న సమయంలో మహిళ మెడలోని పుస్తెలతాడును దుండగులు లాక్కెళ్లారు. ముమ్మర విచారణలో దొంగలు కాచిగూడ నుంచి ట్రైన్లో వెళ్తుండగా, కాజీపేట వద్ద వరంగల్ టాస్క్‌ఫోర్స్ పో లీసులు అదుపులో తీసుకున్నట్లు వరంగడల్ సీపీ రంగనాథ్ తెలిపారు.

