తుపాకీతో బెధిరించి చోరీ

క్రైం వికారాబాద్

తుపాకీతో బెధిరించి చోరీ
– ఇంట్లో చొర‌బ‌డి బంగారం ఎత్తుకెళ్లిన దుండ‌గులు
– వికారాబాద్ జిల్లా కుల్క‌చెర్ల‌లో ఘ‌ట‌న
వికారాబాద్‌, ద‌ర్శిని ప్ర‌తినిధి : న‌ట్టింట్లోకి చొర‌బ‌డిన దొంగ‌లు తుపాకిని చూపించి బెధిరించారు. ఒంటిపై ఉన్న బంగారు ఆభ‌ర‌ణాల‌ను ఎత్తుకెళ్లారు. సినిమా త‌ర‌హాలో చోటు చేసుకున్న ఈ సంఘ‌ట‌న వికారాబాద్ జిల్లాలోని కుల్కచర్లలో క‌ల‌క‌లం రేపింది. వివ‌రాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన జోగు అంజయ్య కుటుంబం పొలం వద్ద నివాసముంటున్నది. అర్ధ‌రాత్రి మంకీ క్యాప్ పెట్టుకొని వచ్చిన నలుగురు గుర్తు తెలియని వ్యక్తులు అంజయ్య ఇంట్లోకి చొరబడ్డారు. తుపాకీతో బెదిరించి ఆయన భార్య అలవేలు ఒంటిపై ఉన్న పుస్తెల తాడును లాక్కున్నారు. బీరువాలో ఉన్న బంగారం సహా మొత్తం 4.5 తులాలు ఎత్తుకెళ్లారు. బాధితులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ సంఘ‌ట‌న శ‌నివారం వెలుగులోకి రావ‌డంతో స్థానికంగా క‌ల‌క‌లం రేపింది.