కరుణించు కట్టమైసమ్మా..!
– వైభవంగా గుమస్తా నగర్ కట్ట మైసమ్మ బోనాలు
– దర్శించుకుని పూజలు చేసిన రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులు శుభప్రద్ పటేల్
తాండూరు, దర్శిని ప్రతినిధి: భక్తులను, ప్రజలను కరుణించు కట్టమైసమ్మా తల్లీ అంటూ తెలంగాణ రాష్ట్ర బీసీ కమీషన్ మెంబర్ శుభప్రద్ పటేల్ అమ్మవారిని వేడుకున్నారు. ఆదివారం తాండూరు పట్టణం గుమాస్తా నగర్ శ్రీకట్ట మైసమ్మ బోనాల జాతర అంగరంగ వైభవంగా జరిగింది. ఈ జాతర ఉత్సవాలకు రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులు శుభప్రద్ పటేల్ ముఖ్య అతిథిగా హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయంలో వెలసిన అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి దర్శనానికి వచ్చిన శుభప్రద్ పటేల్ ను ఆలయ నిర్వాహకులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారి పల్లకిసేవలో శుభప్రద్ పటేల్ పాల్గొని ముందుకు సాగారు. ఈ సందర్భంగా శుభప్రద్ పటేల్ మాట్లాడుతూ… దైవ చింతనతో మానసిక ప్రశాంతత చేకూరుతుందని అన్నారు. అమ్మవారి చల్లని చూపు తాండూర్ ప్రజలపై తప్పక ఉంటుందని అన్నారు. నియోజకవర్గంలోని ప్రజలందరూ సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ మహంకాల్ రఘవేందర్, నాగభూషణం, మచ్చేందర్ రెడ్డి, శరణు బసప్ప, గాజుల శాంత్ కుమార్, సంపత్, రామకృష్ణ, చంద్రకాంత్, దినేష్ వీరేశం, శివకుమార్, సునీల్ కుమార్, బోయినికిరణ్, గణేష్, గోరేపల్లి వీరేశం, శుభప్రద్ పటేల్ యవసేన సభ్యులు భాను, ఇందూర్ కుర్వబాలు, నరేష్, హరీష్ విజయ్ తదితరులు పాల్గొన్నారు.

