కమలమ్మకు ఎమ్మెల్సీ నివాళులు

తాండూరు రాజకీయం వికారాబాద్

కమలమ్మకు ఎమ్మెల్సీ నివాళులు
– వర్ధంతిలో పాల్గొన్న ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మున్సిపల్ బీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ శోభారాణి తల్లి స్వర్గీయ మాజీ కౌన్సిలర్ జంటుపల్లి కమలమ్మకు ఉమ్మడి రంగా రెడ్డి జిల్లా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి నివాళులు అర్పించారు. గురువారం పాత తాండూరులో కమలమ్మ ప్రథమ వర్ధంతి నిర్వహించారు. ఈ సందర్భంగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి హాజరై కమలమ్మ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఎమ్మెల్సీ వెంట మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమల్ గుప్త, డీసీసీబీ జిల్లా డైరెక్టర్ రవీందర్ గౌడ్, బీఆర్ఎస్ పట్టణ మాజీ అధ్యక్షులు అబ్దుల్ రవూఫ్, మాజీ డీపీసి సభ్యులు పట్లోళ్ల నర్సింలు, బీఆర్ఎస్ నాయకులు సాయిపూర్ బాల్ రెడ్డి, సిద్రాల శ్రీనివాస్, ఇందూరు ప్రకాష్, కౌన్సిలర్లు వెంకన్న గౌడ్, బోయ రవిరాజు, రాము తదితరులు ఉన్నారు. మరోవైపు స్వర్గీయ కమలమ్మ గతంలో నాగారం నర్సింలు చైర్మన్‌గా ఉన్న సమయంలో పాత తాండూరు వార్డు ప్రజలకు సేవలను అందించారు. ఆమె చేసిన సేవలను ప్రజలు ఇప్పటికి స్మరించుకుంటున్నారు.