సాయినాథ్‌ మహరాజ్‌కీ జై..!

తాండూరు రాజకీయం వికారాబాద్

సాయినాథ్‌ మహరాజ్‌కీ జై..!
– శోభాయమానంగా శోభాయాత్ర
– సాయినాథునికి ఘన పూజలు
-దర్శించుకున్న ప్రముఖులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : సాయినామస్మరణతో తాండూరు పురవీధులు మార్మోగాయి. గురుపౌర్ణమి మహోత్సవాన్ని పురస్కరించుకుని తాండూరు కోకట్ రోడ్డు మార్గంలో వెలసిన షిర్డి సాయిబాబా భజన మండలి ఆధ్వర్యంలో చేపట్టిన సాయిబాబా ఊరేగింపు శోభాయమానంగా కొనసాగింది. ఆదివారం తాండూరు పట్టణంలోని కోడంగల్డ్, అంబేద్కర్ చౌరస్తా సమీపంలో ఉన్న భవాని మాత దేవాలయం నుంచి ఈ శోభాయాత్ర ముందుకు కదిలింది. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజుగౌడ్, తాండూరు మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ తదితరులు శోభాయాత్రను ప్రారంభించారు. అనంతరం తాండూరుకు చెందిన ప్రముఖులు సాయిపుత్ర హోమ్స్ అధినేత భావనోళ్ల శంకర్ యాదవ్, చంద్రకళ దంపతులు శోభాయాత్రలో సాయినాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అనంతరం దేవాలయం ముందు నుంచి సాయిబాబా రథయాత్ర ప్రారంభమయ్యింది. పట్టణంలోని పుర వీధులగుండా ఈ ఊరేగింపు కొనసాగింది. భవానిమాత దేవాలయం నుంచి శివాజీ చౌక్, మర్రి చెట్టు కూడలి, గాంధీ చౌక్, భద్రేశ్వరౌచౌక్, మార్వాడి బజార్, డీఎస్పీ కార్యాలయం మీదుగా తాండూరు మున్సిఫ్ కోర్టు, శాంతినగర్ నుంచి కోకట్ రోడ్డు మార్గంలో ఉన్న సాయిబాబా దేవాలయం వరకు చేరింది. ఊరేగింపు ముందు భక్తులు సాయిబాబా మహిమలను చాటుతూ భజన కీర్తనలు ఆలాపించారు. ఈ ఊరేగింపుకు ప్రజలు, భక్తులు స్వాగతం పలుకుతూ భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. మరోవైపు దేవాలయంలో గురుపౌర్ణమి మహోత్సవాన్ని పురస్కరించుకుని రేపు సోమవారం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటి, భజనమండలి సభ్యులు పేర్కొన్నారు. ఉదయం మేలుకొలుపు, సామూహిక పుష్పాభిషేకం, మధ్యాహ్న హారతి, అన్నదానం, సాయంత్రం హారతి, రాత్రి పల్లకిసేవ వంటి కార్యక్రమాలు ఉంటాయని వెల్లడించారు. గురుపౌర్ణమి మహోత్సవంలో భక్తులు అధికసంఖ్యలో పాల్గొని సాయికృపకు పాత్రులు కాగలరని కోరారు.

ఇది కూడా చదవండి…

తాత తడబడలేదు..!

chaithany collage