లోక్ అదాలత్‌లో 98 కేసుల రాజీ

క్రైం తాండూరు వికారాబాద్

లోక్ అదాలత్‌లో 98 కేసుల రాజీ
– విశ్రాంత న్యాయమూర్తి కె.జనార్దన్‌ ఆధ్వర్యంలో పరిష్కారం
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు పట్టణం జూనియర్ సివిల్ జడ్జ్ న్యాయస్థానంలో నిర్వహించిన లోక్ అదాలతో 98 కేసులు రాజీ అయ్యాయి. శనివారం విశ్రాంత న్యాయమూర్తి కె.జనార్ధన్ ఆధ్వర్యంలో లోక్ అదాలత్ నిర్వహించారు. ఇందులో భాగంగా 18 అబ్కారీ కేసులు, 2 భరణం కేసులు, 49 పెట్టీ కేసులతో పాటు నేరం ఒప్పుకోలు, సివిల్ కేసులకు సంబంధించి మరో 29 కేసులలో కక్షిదారులు 98 కేసులను రాజీకి అంగీకరించారు. ఈ కార్యక్రమంలో లోక్ అదాలత్ మెంబర్లు శ్రీనివాస్ రెడ్డి, రాంరెడ్డి, సీనియర్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కల్పన, సీనీయర్ న్యాయవాదులు విజయ్ కుమార్, పి.శ్రీనివాస్, భవనప్ప, మనోహర్ రావు, న్యాయవాదులు కె.గోపాల్, P. రవికుమార్, బి.రవికుమార్, పీసీ రెడ్డి, సుదర్శన్, కె.రవీందర్, జూనియర్ న్యాయవాదులు, కక్షిదారులు, లోక్ అదాలత్ సిబ్బంది, కోర్టు సిబ్బంది, పోలీసు అధికారులు పాల్గొన్నారు.