చదువుతోనే కీర్తి ప్రతిష్ఠలు
– తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి
– బీఆర్ఎస్వీ నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ
తాండూరు, దర్శిని ప్రతినిధి : చదువుతోనే విద్యార్థులకు కీర్తి.. ప్రతిష్ఠలు పెరుగుతాయని తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి అన్నారు. గురువారం తాండూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బీఆర్ఎస్వే తాండూరు ఇంచార్జ్ జిలాని ఆధ్వర్యంలో ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి బీఆర్ఎస్ విద్యార్థి విభాగంకు సంబంధించిన నూతన క్యాలెండర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి విద్యార్థులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థులు భాగా కష్టపడి చదువుకోవాలన్నారు. చదువుతోనే గుర్తింపు.. కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయన్నారు. చక్కగా చదివి తాండూరుకు మంచి గుర్తింపు తీసుకరావాలని ఆకాంక్షించారు.

అదేవిధంగా బీఆర్ఎస్వీ డివిజన్ కమిటి ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీలలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ఎమ్మెల్యే చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు అఫ్పూ(నయూం), కార్మిక విభాగం అధ్యక్షులు కె.గోపాల్, బీఆర్ఎస్ పట్టణ కార్యదర్శి సంతోష్ గౌడ్, అబ్దుల్ సమద్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

