ప్రభుత్వ డిగ్రీ కాలేజీకి ఐఎస్‌ఓ గుర్తింపు

కెరీర్ తాండూరు వికారాబాద్

ప్రభుత్వ డిగ్రీ కాలేజీకి ఐఎస్‌ఓ గుర్తింపు
– జిల్లాలో ఏకైక కళాశాలగా గౌరవం
– వెల్లడించిన ప్రిన్సిపల్ డా.రవీందర్
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు అరుదైన గౌరవం దక్కింది. కళాశాలకు ఐఎస్‌ఓ(9001 : 2015) గుర్తింపు లభించింది. ఈ మేరకు సర్టిఫికెట్‌ను కూడ పొందింది. దీంతో తాండూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల జిల్లాలోనే ఐఎస్‌ఓ గుర్తింపు పొందిన కళాశాలగా నిలిచింది. ఈ విషయాలను శుక్రవారం కళాశాల ప్రిన్సిపల్ డా. రవీందర్ ఓ ప్రకటనలో తెలిపారు. కళాశాలలో మంచి విద్యా ప్రమాణాలు, నాణ్యమైన విద్యను అందించడంలో భాగంగా కళాశాలలకు ఐఎస్‌ఓ దృవపత్రం అందజేస్తారని ఆయన తెలిపారు. అయితే తాండూరులోని డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంతో పాటు నాణ్యత ప్రమాణాలను పాటించించినందుకు కళాశాలకు ఐఎస్‌ఓ గుర్తింపు సర్టిఫికెట్ అందిందని పేర్కొన్నారు. జిల్లాలోనే మొట్ట మొదటి సారిగా ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఐఎస్‌ఓ గుర్తింపు సాధించిన కళాశాలగా రికార్డు సాధించిందన్నారు. ఈ సర్టిఫికెట్ ద్వారా కళాశాల విద్యా ప్రమాణాలతో పాటు నాణ్యత ప్రమాణాలు పెంచుకునే అవకాశం ఉందన్నారు. అదేవిధంగా ఈ సర్టిఫికెట్ కాల పరిమితి 2025 జూన్ 14 వరకు ఉంటుందన్నారు. ఆ తరువాత మళ్లీ విద్యా ప్రమాణాలు, నాణ్యతా ప్రమాణాలను పునః పరిశీలించి పొడగించే అవకాశం ఉంటుందన్నారు. కళాశాలకు ఐఎస్‌ఓ గుర్తింపు సర్టిఫికెట్‌ రావడంపై హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల అద్యాపకులు, అద్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు.