నైపుణ్య రంగాల్లో రాణించాలి

కెరీర్ తాండూరు రాజకీయం వికారాబాద్

నైపుణ్య రంగాల్లో రాణించాలి
– స్వయం ఉపాధితోనే మహిళల అభివృద్ధి
– రాష్ట్ర బీసీ కమీషన్ మెంబర్ శుభప్రద్ పటేల్
– మహిళల ఉచిత శిక్షణ కేంద్రం సందర్శన
తాండూరు, దర్శిని ప్రతినిధి : మహిళలు నైపుణ్య రంగాలలో రాణించాలని తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషనర్ మెంబర్ శుభప్రద్ పటేల్ అన్నారు. బ్యాంకర్ల గ్రామీణ, ఔత్సహికుల అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో పట్టణంలోని లెమన్ ట్రీ కాంప్లెక్స్ పైన మహిళలకు ఎంబ్రాయిడరి శిక్షణ కేంద్రాన్ని నిర్వహిస్తున్నారు. మంగళవారం ఈ శిబిరాన్ని బీసీ కమీషన్ మెంబర్ శుభప్రద్ పటేల్ సందర్శించారు. మహిళలు నేర్చుకుంటున్న డిజైన్ వర్కులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలు స్వయం ఉపాధి సాధించేలా ఉచిత శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. మహిళలు ఆర్థికాభివృద్ధి దిశగా అడుగులు వేయాలన్నారు. నైపుణ్య రంగాలలో స్వయం ఉపాధితో రాణించాలన్నారు. ఆర్ధికంగా అభివృద్ధి సాధించేందుకు ఇలాంటి శిక్షణ శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో బీఐఆర్ డీ కోఆర్డినేటర్ సత్తయ్య, శిక్షకురాలు సంధ్యారాణి, నాయకులు విష్ణు, లక్ష్మణ్, శుభప్రద్ యువసేన సభ్యులు భాను ప్రసాద్, హరీష్ తదితరులు పాల్గొన్నారు.