వినాయక ఆసుపత్రిలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు
– హాజరైన తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం శాంతినగర్‌లోని వినాయక ఆసుపత్రి వద్ద 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. వినాయక సూపర్ స్పెషలిస్ట్ హాస్పిటల్ అధినేత మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వర్త్య విద్య నాయక్ ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు జరుపుకున్నారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన తాండూర్ ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి జాతీయ జెండా ఎగురవేశారు. హాస్పటల్ సిబ్బంది జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ పట్లోళ్ల బాల్‌రెడ్డి, తాండూరు పట్టణ యూత్ అధ్యక్షులు బంటువేణు, బాతుల నాగు, భాస్కర్ రెడ్డి, హాస్పటల్ సిబ్బంది కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

