మా బాబులాంటి కష్టం ఎవ్వరికి రావోద్దు..!
– ఆపరేషన్ కోసం ఆర్థిక సాయం మరువలేనిది
– సాయం అందించిన దాతలందరికి కృతజ్ఞతలు
– వశిష్ట తల్లిదండ్రులు భానుప్రియ, శివకుమార్
తాండూరు, దర్శిని ప్రతినిధి : మా బాబుకు వచ్చిన కష్టం మీ ఇండ్లల్లో ఎవ్వరికి రావద్దని అరుదైన కాలేయ వ్యాధితో బాధపడుతున్న 10నెలల బాలుడు వశిష్ఠ తల్లిదండ్రులు అన్నారు. బాబు ఆపరేషన్ కోసం ఆర్థిక సాయం అందించిన దాతలందరికి వారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. యాలాల మండలం సంగెం గ్రామానికి చెందిన శివకుమార్, భానుప్రియ దంపతుల కుమారుడు వశిష్ట(10నెలలు), అరుదైన కాలేయా వ్యాధి(బైలేరియా అట్రేసై)తో బాధడుతున్నాడు.

వ్యాధి నుంచి బాలుడిని కాపాడుకోవాలంటే కాలేయ మార్పిడి చేయాలని వైద్యులు నిర్ధారించారు. బాలుడుకు కాలేయాన్ని అందించేందుకు తండ్రి శివకుమార్ ముందుకు వచ్చారు. చెన్నైలోని ఓ ఆసుపత్రిలో నిర్వహించే చికిత్సకు రూ.25లక్షలు ఖర్చు అవుతోంది. పేదరికంలో ఉన్న దంపతులు అంతమొత్తంలో ఖర్చు చేసేందుకు ఇబ్బందులు పడుతున్న విషయం తెలుసుకున్న ఆర్బీఓఎల్ సీఈఓ బుయ్యని శ్రీనివాస్ రెడ్డి స్ఫూర్తితో దాతల ద్వారా కుటుంబానికి రూ.16లక్షలు సమకూరాయి. ఈ సహాకారంతో చెన్నైలోని ఓ ఆసుపత్రిలో చికిత్స జరుగుతోంది.

ఈ సందర్భంగా బాలుడు తల్లిదండ్రులు భానుప్రియ, శివకుమార్ ఆర్బీఓఎల్ శ్రీనివాస్ రెడ్డితో పాటు సహాయం అందించిన దాతలు అందరికి కృతజ్ఞతలు తెలిపారు. అదేవి ధంగా విద్యావేత్త పర్యాద రామకృష్ణ బాలుడు తల్లిదండ్రులతో మాట్లాడారు. బాలుడు అందిస్తున్న చికిత్సను అడిగి తెలుసుకున్నారు. త్వరలోనే బాలుడికి కాలేయ మార్పిడి ఆపరేషన్ చేస్తారని తెలిపారని ఆయన తెలిపారు. అనంతరం బాలుడి కోసం ముందుకు వచ్చి సాయం అందించిన అందరికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో యువనాయకులు జోషి వికాస్ తదితరులు ఉన్నారు.
ఇదికూడా చదవండి…

