బావనోళ్ల భక్తుల సేవ..!

తాండూరు రాజకీయం వికారాబాద్

బావనోళ్ల భక్తుల సేవ..!
– శ్రీశైలంలో భక్తులకు అన్నదానం
– మూడు రోజుల పాటు సేవ
– గొప్ప అనుభూతి: బావనోళ్ల శంకర్ యాదవ్
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరుకు చెందిన శ్రీ సాయిపుత్ర హోమ్స్ అండ్ డెవలపర్స్ అధినేత శంకర్ యాదవ్ శ్రీశైల భక్తుల సేవలో తరించారు. సోమవారం శ్రీశైలంలోని శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా భావనోళ్ల శంకర్ యాదవ్ భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు.

మూడు రోజుల పాటు జరిగే అన్నదాన కార్యక్రమాన్ని తండ్రి హణ్మయ్య, కుమారుడు అభినవ్ సాయి, స్నేహితులతో కలిసి చేపట్టారు. శ్రీశైలంలోని పాతాళ గంగకు వెళ్లే మార్గంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో అంతకుముందు శ్రీశైల బ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థాన అర్చకులు గంగాదర స్వామి, వికారాబాద్ జిల్లాకు చెందిన వాస్తు జ్యోతిష్యులు విశ్వం పంతులు ఆధ్వర్యంలో పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీశైల దేవస్థాన ఈఓ లవన్న శంకర్ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా బావనోళ్ల శంకర్ యాదవ్ మాట్లాడుతూ గత ఎనిమిదేళ్లుగా బ్రహ్మోత్సవాలలో భాగంగా భక్తులకు అన్నదానం చేయడం జరుగుతుందన్నారు. భక్తులకు అన్నదానం చేయడంలో ఆత్మ సంతృప్తి, గొప్ప అనుభూతిని కలిగిస్తుందన్నారు. మూడు రోజుల పాటు జరిగే అన్నదాన కార్యక్రమంలో శ్రీశైల భక్తులతో పాటు జిల్లాకు చెందిన భక్తులు తరలివచ్చి పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. సాయంత్రం వేళ అల్పాహారం సైతం పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ డీపీసీ సభ్యులు పట్లోళ్ల నర్సింలు, బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్, బీఆర్ఎస్ నాయకులు సాయిపూర్ బాల్ రెడ్డి, బంటారం మాజీ ఎంపీపీ రాములు యాదవ్, మిత్రులు జొన్నల వినోద్ కుమార్, స్పైసీ మనోహర్ యాదవ్, ప్రేమ్ కుమార్, బంటు మల్లప్ప, వేణుగోపాల్ రెడ్డి, శ్రీ సాయిపుత్ర సేవా సమితి సభ్యులు అరవింద్ యాదవ్, మల్ రెడ్డి, మల్లేష్ యాదవ్, విఠల్, వెంకట్, శ్రీనివాస్ రెడ్డి, నర్సింలు గౌడ్, గోపాల్, అంజి, చెంగోల్ రాము యాదవ్, కిరణ్ యాదవ్, పవన్ కృష్ణ, జిల్లా నాయకులు ప్రభాకర్ రెడ్డి, రవిశంకర్, వైద్యనాధ్, శ్రీశైల దేవస్థాన అధికారులు. బెంగోల్ గ్రామ యువకులు తదితరులు పాల్గొన్నారు.