మందు బాబులకు రాత శిక్ష..!
– తాగి డ్రైవింగ్ చేయమని వెయ్యి సార్లు రాయించిన పోలీసులు
– హై కోర్టు జోక్యంతో 16 మందిపై కేరళ పోలీసుల చర్యలు
దర్శిని డెస్క్: అది కేరళలోని ఓ పోలీస్ స్టేషన్… కొంత మందితో పోలీసులు దగ్గరుండి ఇంపోజిషన్ రాయించారు. రాస్తున్నది మాత్రం ఎవరో కాదు…రేయింబవళ్ళు మత్తు జగత్తులో జోగుతోన్న మందుబాబులే. మద్యం విషయంలో ఇక మారుతామనే అనే విధంగా మందుబాబులకు కేరళలోని పోలీసులు రాత శిక్ష విధించారు. హైకోర్టు జోక్యంతో వారికి ఈ వైరటీ పనిష్మెంట్ ఇచ్చారు. అసలేం జరిగిందనే వివరాల్లోకి వెళితే ఆదివారం కొచ్చిలో ఓ ప్రైవేట్ బస్సు ఢీకొనడంతో ద్విచక్ర వాహనదారుడు మరణించాడు. దీంతో హైకోర్టు జోక్యం చేసుకొని కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించింది. అప్రమత్తమైన పోలీసులు సోమవారం తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో 16 మంది డ్రైవర్లు పట్టుబడ్డారు. ఈ క్రమంలో పట్టుబడిన మందుబాబులకు త్రిపునితుర పోలీసులు వింత శిక్ష వేశారు. ‘ఇకపై తాగి డ్రైవింగ్ చేయను’ అని వారితో వెయ్యిసార్లు రాయించారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే న్యాయ వ్యవస్థలో కఠిన శిక్షలు ఉంటాయి. లైసెన్సు స్వల్ప కాలానికి సస్పెండ్ చేయడంతోపాటు అరెస్టు తర్వాత బెయిల్ వస్తుంది. కానీ ఇంపోజిషన్ రాసిన శిక్ష వేడయం సోషల్ మీడియాలో చర్చకు దారి తీసింది. ఇంపోజిషన్ రాసినప్పటికీ వారికి అసలు శిక్ష తప్పదని పోలీసులు స్పష్టంచేశారు.

