రైతు కుటుంబానికి చేయూత

క్రైం తాండూరు రాజకీయం వికారాబాద్

రైతు కుటుంబానికి చేయూత
– రూ. 5వేలు అందజేసిన శుభప్రద్ పటేల్ యువసేన
యాలాల, దర్శిని ప్రతినిధి: అప్పుల బాధతతో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబానికి తెలంగాణ బీసీ కమీషన్ మెంబర్ శుభప్రద్‌ పటేల్ చేయూతనందించారు. శుభప్రద్ పటేల్ యువసేన ఆధ్వర్యంలో బాధిత రైతు కుటుంబానికి రూ. 5 వేల ఆర్థిక సహాయం అందజేశారు. వివరాల్లోకి వెళితే.. యాలాల మండలం బండమీది పల్లికి గ్రామానికి చెందిన బొల్లె అంజిలప్ప(35) ఆర్ధిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకున్నారు.

మంగళవారం ఈ విషయం తెలుసుకున్న శుభప్రద్ పటేల్ యువసేన సభ్యులు బాసటగా నిలిచారు. రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులు శుభప్రద్ పటేల్ సూచన మేరకు బండమీదిపల్లికి గ్రామనికి వెళ్లి మృతి చెందిన రైతు కుటుంబాన్ని పరామర్శించారు. గ్రామ సర్పంచ్ గడ్డలి రాంచద్రమ్మ లక్ష్మప్పతో కలిసి కుటుంబానికి రూ. 5 వేల ఆర్ధిక సహాయం అందజేశారు. అనంతరం శోక సంద్రంలో మునిగిన రైతు కుటుంబానికి ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో శుభప్రద్ పటేల్ యువసేన సభ్యులు భాను ప్రసాద్, కుర్వబాలు, హరీష్, ప్రశాంత్, విజయ్, నరేష్ గౌడ్ తో పాటు గ్రామ పెద్దలు బొల్లే పెద్ద హన్మప్ప, అంజి గౌడ్, ఎం బస్వరాజ్ నర్సింలు తదితరులు ఉన్నారు.