కాంగ్రెస్‌తోనే అన్ని వర్గాల అభ్యున్నతి

తాండూరు రాజకీయం వికారాబాద్

కాంగ్రెస్‌తోనే అన్ని వర్గాల అభ్యున్నతి
– కర్ణాటక ఆరోగ్యశాఖ మంత్రి శరణు ప్రతాప్ పటేల్
– తాండూరు వీరశైవుల గౌరవ పెంపుకు కృషి
– కాంగ్రెస్ అభ్యర్థి, డీసీసీబీ చైర్మన్ మనోహర్ రెడ్డి
– తాండూరు వీరశైవులతో ఆత్మీయ సమ్మేళనం
తాండూరు, దర్శిని ప్రతినిధి: కాంగ్రెస్ పార్టీతోనే అన్ని వర్గాల అభ్యున్నతి సాధ్యమవుతుందని కర్ణాటక రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి శరణు ప్రతాప్ పటేల్ అన్నారు. శనివారం రాత్రి తాండూరు పట్టణంలోని ఎంపీటీ హాల్ లో వీరశైవ సమాజం సభ్యులతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సమావేశానికి కర్ణాటక ఆరోగ్య శాఖ మంత్రి శరణు ప్రతాప్ పటేల్ తాండూరు ఎమ్మెల్యే అభ్యర్థి, డీసీసీబీ చైర్మన్ బుయ్యని మనోహర్ రెడ్డితో కలిసి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా మంత్రి శరణు ప్రతాప్ పటేల మాట్లాడుతూ పేదలకు సంక్షేమ రాజ్యం అందించాలని కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందన్నారు. ఇందుకోసమే గ్యారెంటీ పథాలను అమలు చేస్తుందన్నారు. దీంతో పాటు అన్ని వర్గాల అభ్యున్నతికి కాంగ్రెస్ పార్టీ ముందుకు సాగుతుందన్నారు. అదేవిధంగా తాండూరు అభ్యర్థి మనోహర్ రెడ్డి మాట్లాడుతూ తాండూరులో వీరశైవుల గౌరవాన్ని పెంపొందించేలా కృషి చేస్తానని అన్నారు. ఎన్నికల్లో మరోసారి బీఆర్ఎస్ పార్టీని నమ్మి మోసపోవద్దన్నారు.

సంక్షేమ ప్రభుత్వాన్ని తీసుకవస్తున్న కాంగ్రెస్ పార్టీని ఆదరించాలన్నారు. ఎన్నికల్లో గెలిపిస్తే ప్రతి ఓటరు గర్వపడేలా తాండూరు అభివృద్ధికి తోడ్పడుతానని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు డాక్టర్ సంపత్ కుమార్, తాండూరు వీరశైవ సమాజం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి…

సార్లు వస్తున్నారు..!